తనను తాను సూపర్‌మ్యాన్‌లా భావిస్తున్న ట్రంప్‌

తనకు తాను ప్రొజెక్ట్‌ చేసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రగణ్యులు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తానో శక్తిమమ్యాన్‌లా, సూపర్‌మ్యాన్‌లా ఫీలవుతున్నారు.. ఫీలవుతే అయ్యారు కానీ అది బయటకు చెప్పుకుంటున్నారు..

తనను తాను సూపర్‌మ్యాన్‌లా భావిస్తున్న ట్రంప్‌
Follow us

|

Updated on: Oct 15, 2020 | 8:34 AM

తనకు తాను ప్రొజెక్ట్‌ చేసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అగ్రగణ్యులు.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తానో శక్తిమమ్యాన్‌లా, సూపర్‌మ్యాన్‌లా ఫీలవుతున్నారు.. ఫీలవుతే అయ్యారు కానీ అది బయటకు చెప్పుకుంటున్నారు.. కరోనా వైరస్‌ చికిత్స తీసుకున్న తర్వాత తనకి తానే ఓ సూపర్‌మ్యాన్‌లా అనిపిస్తున్నానని, ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా వచ్చేసిందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులతో మాట్లాడుతూ చాలా గొప్పలు చెప్పుకున్నారు.. కరోనా తగ్గడానికి తనకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయని, అందుకు వైద్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. యాంటీ బాడీస్‌ చికిత్స కోసం ఏ మందులు ఇచ్చారో తెలియదు కానీ అవి తీసుకున్నాక మాత్రం ఆరోగ్యం బాగా మెరుగయ్యిందని ట్రంప్‌ సెలవిచ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లు వాల్టర్‌ రీడ్‌ హాస్పిటల్‌లో ఉన్నారని చెప్పారు. తాను కూడా వైట్‌హౌస్‌లో ఓ గదిలో కూర్చోవచ్చు కానీ తాను అలా చేయలేనని అన్నారు. ఈ దేశానికి అధ్యక్షుడిని కాబట్టి ప్రజలను కలుసుకోవలసిన బాధ్యత తనమీద ఉందని తెలిపారు. క్షణం తీరిక లేకుండా ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.. కారణం సర్వేలు జో బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారని చెప్పడమే! రాబోయే ఎన్నికల్లో ఇండో అమెరికన్లు డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌కే మద్దతు తెలపబోతున్నారని తాజా సర్వే తెలిపింది. 72 శాతం మంది ఇండో అమెరికన్లు బైడెన్‌కే ఓటు వేస్తామని చెప్పారట! ట్రంప్‌కు 22 శాతం మంది మాత్రమే మద్దతు ఇస్తున్నారట! డెమొక్రాటిక్‌ నుంచి ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్‌కు జై కొడుతున్నవారు ఎక్కువయ్యారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..