నో షేరింగ్.. ఓన్లీ ఓన్ వెహికల్స్ అంటూ హైదరాబాదీలు..!

లాక్ డౌన్ సడలింపులతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు మినహా క్యాబ్స్, ఆటోలు, బైక్ టాక్సీలు సేఫ్టీ ప్రికాషన్స్ తో రోడ్లపైకి వచ్చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కుదేలైన సామాన్య మానవుడు మాత్రం.. అత్యవసరమైతే తప్ప సొంత వాహనాలతోనే ప్రయాణిస్తున్నారు

నో షేరింగ్.. ఓన్లీ ఓన్ వెహికల్స్ అంటూ హైదరాబాదీలు..!
Follow us

|

Updated on: Jun 01, 2020 | 4:08 PM

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కదలనివ్వకుండా చేసింది. జన జీవనం స్తంభించింది. మరోవైపు కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేంత వరకు సహజీవనం చేయాల్సిందే నంటూ దేశాధినేతలు తేల్చి చెప్పడంతో జనం జీవన పోరాటం మొదలు పెట్టారు. లాక్ డౌన్ సడలింపులతో ప్రైవేట్ రవాణ వ్యవస్థకు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు మినహా క్యాబ్స్, ఆటోలు, బైక్ టాక్సీలు సేఫ్టీ ప్రికాషన్స్ తో రోడ్లపైకి వచ్చేశాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కుదేలైన సామాన్య మానవుడు మాత్రం.. అత్యవసరమైతే తప్ప సొంత వాహనాలతోనే ప్రయాణిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తో జనం ప్రైవేట్ రవాణ వ్యవస్థను నమ్మడంలేదు. ఆర్టీసీ బస్సులు, మెట్రో లాంటి ప్రజా రవాణ మొదలు కాకపోవడంతో క్యాబ్స్, ఆటోలకు డిమాండ్ ఉంటుందని అంతా అనుకున్నారు. కంటికి కనిపించని కరోనా ఏ రూపంలో అంటుకుంటుందోనన్న బెంగ జనంలో నాటుకుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భౌతిక దూరం పాటించడమే ఉత్తమంగా భావిస్తున్నారు. దీంతో ప్రైవేట్ క్యాబ్స్, ఆటోవాలాకి బుకింగ్స్ మాత్రం అంతగా మాత్రంగానే ఉంటున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రైవేట్ టాక్సీల జోలికి వెళ్లడంలేదు. చాలా వరకు సొంత వాహనాలతోనే బయటికి వస్తున్నారు. సొంత వెహికల్ లేనివాళ్లు సింగిల్ బుకింగ్ చేసుకుని ట్యాక్సీల్లో ప్రయాణిస్తున్నారు. క్యాబ్ సంస్థలు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ తెలియని వారితో కలిసి షేర్ చేసుకోవడానికి జనం ఇంట్రస్ట్ చూపడంలేదు. ఆటోలో ఇద్దరు, క్యాబ్ డ్రైవర్ కాకుండా మరో ఇద్దరు జర్నీ చేసే చాన్స్ ఉన్నా ప్రయాణించేందుకు జంకుతున్నారు. దీంతో ఆటోలకు పెద్దగా గిరాకీ ఉండడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్, బైక్.. ఇలా తమ దగ్గరున్న వాటితోనే ఎక్కువగా జర్నీ చేస్తున్నామంటున్నారు జనం. దూరాన్ని బట్టి నడచి వెళ్తున్నామంటున్నారు. లాక్ డౌన్ కి ముందు హైదరాబాద్ సిటీలో 15వేలకు పైగా నడిచేవి. తక్కువ చార్జీతో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా వెళ్లేలా రెంటల్, బైక్ ట్యాక్సీలు రావడంతో ఎక్కువమంది వాటి వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత సమయంలో నగరవ్యాప్తంగా 5 వేల క్యాబ్స్ కూడా తిరగడం లేదు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు కారును శానిటైజ్ చేయడంతోపాటు మాస్క్, గ్లౌస్ వాడుతున్నా జనం క్యాబ్ షేర్ వైపు మొగ్గు చూపడంలేదంటున్నారు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..