బెజ‌వాడ గ్యాంగ్‌వార్..సందీప్ మృతదేహం తరలింపులో గంద‌ర‌గోళం..

విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో స్టూడెంట్ లీడ‌ర్ తోట సందీప్ ప్రాణాలు కోల్పోయాడు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:02 pm, Mon, 1 June 20
బెజ‌వాడ గ్యాంగ్‌వార్..సందీప్ మృతదేహం తరలింపులో గంద‌ర‌గోళం..

విజయవాడ పటమటలో జరిగిన గ్యాంగ్‌వార్‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్యాంగ్ వార్ లో స్టూడెంట్ లీడ‌ర్ తోట సందీప్ ప్రాణాలు కోల్పోయాడు. అత‌డి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన అనంత‌రం… తరలింపులో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు నెల‌కున్నాయి. సందీప్ తల్లి కదలలేని పరిస్థితిలో ఉందని, క‌డ‌చూపు కోసం బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కుటుంబసభ్యులు రిక్వెస్ట్ చేశారు. అయితే సందీప్ ఫ్యామిలీ నివశిస్తోన్న‌ ప్రాంతం రెడ్‌జోన్‌లో ఉండ‌టంతో పోలీసులు అందుకు నిరాక‌రించారు. నేరుగా స్వర్గపురికే మృతదేహం తరలించారు. దాన్ని చూసేందుకు తరలివస్తున్న ప‌లువురు యువ‌కుల‌ను సైతం పోలీసులు అడ్డుకున్నారు. సందీప్‌ మృతికి నివాళిగా అతడి ఫ్రెండ్స్ పటమటలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌గా..వాటిని వీఎంసీ సిబ్బంది, పోలీసులు తొలగించారు.

మ‌రో వైపు ఈ ఘ‌ట‌న‌ను సీరియ‌స్ తీసుకున్న బెజ‌వాడ పోలీసులు..ఏడు బృందాలతో నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఓ అపార్ట్‌మెంట్‌ విషయమై జరిగిన సెటిల్‌మెంట్‌లో ఈ ఘ‌ర్ష‌ణ చెల‌రేగిన్ట‌ట్టు ప్రాథ‌మికంగా తేల్చారు.