రాజన్న హుండీ ఆదాయం 78.85లక్షలు

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్లడించారు...

రాజన్న హుండీ ఆదాయం 78.85లక్షలు

Updated on: Nov 04, 2020 | 2:48 AM

Hundi Count : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి హుండీ లెక్కింపు మంగళవారం ఆలయ ఓపెన్ స్లాబ్‌పై నిర్వహించారు. 14 రోజులకుగాను రూ.78 ,85,912 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ వెల్లడించారు.

ఆలయ ఓపెన్‌స్లాబ్‌పైన హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఈవో ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగింది. ఇందులో 124 గ్రాముల బంగారం, 6.5 కిలోగ్రాముల వెండి సమకూరినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.