గ్రామ వాలంటీర్ల నియామకాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల్లోనే 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. కాగా దరఖాస్తుల అధికంగా వస్తుండటంతో అధికారులు ముందుగానే పరిశీల ప్రారంభించారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం జూలై 5 వరకు దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పదో తేదీ నుంచి మండల స్థాయి కమిటీలు పరిశీలన చేసి…11నుంచి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంది. దరఖాస్తులు ఎక్కువగా అందుతుండటంతో పదో తేదీ ఒక్కరోజు మొత్తం దరఖాస్తులను మండల కమిటీ పరిశీలన చేయడం సాధ్యం కాదని, దరఖాస్తు అందిన వెంటనే పరిశీలన చేసి నమోదు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. మరోవైపు గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌కు వీక్షకులు పోటెత్తారు. సుమారు తొమ‍్మిది లక్షలమందికి పైగా గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను వీక్షించారు.