మహా దీపోత్సవం…లక్షలాది దీపకాంతులతో మెరిసిన అయోధ్య నగరం

దీపావళి సందర్భంగా చారిత్రక అయోధ్య నగరం మహా దీపోత్సవంతో వెలిగిపోయింది. 5లక్షల 51వేల దీపాలతో నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండువగా మెరిసింది. పండగకు ఒకరోజు ముందే దీపోత్సవ శోభతో అయోధ్యపురి వెలుగులతో

మహా దీపోత్సవం...లక్షలాది దీపకాంతులతో మెరిసిన అయోధ్య నగరం

Updated on: Nov 14, 2020 | 4:30 AM

Deepotsavam : దీపావళి సందర్భంగా చారిత్రక అయోధ్య నగరం మహా దీపోత్సవంతో వెలిగిపోయింది. 5లక్షల 51వేల దీపాలతో నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండువగా మెరిసింది. పండగకు ఒకరోజు ముందే దీపోత్సవ శోభతో అయోధ్యపురి వెలుగులతో నిండిపోయింది. కనుచూపుమేర వెలిగిన లక్షలాది దీపకాంతులతో.. అయోధ్య నగరం కాంతులీనింది. కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలతో సరయూ నదీ తీరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది.

రాముడి జన్మస్థలం అయోధ్యలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం అట్టహాసంగా నిర్వహించిన మహా దీపోత్సవంతో అయోధ్య దివ్వెల వెలుగుల్లో సరికొత్తగా కాంతులీనింది. 5లక్షల 51వేల దీపాలతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు అధికారులు. ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.