చరిత్రకారుడి ‘ చరిత్ర ఇది ! లాక్కెళ్లిన ఖాకీ !

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న అనేకమంది రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. బెంగుళూరులో గురువారం ఉదయం దాదాపు 20, 30 మంది ప్రముఖులను బలవంతంగా వారు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. వీరిలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా ఒకరు. మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయనను ఒక పోలీసు బలవంతంగా ఈడ్చుకువెళ్లి దగ్గరలో ఉన్న తమ ‘ పోలీస్ బస్సు ‘ ఎక్కించాడు. మరికొంతమంది […]

చరిత్రకారుడి ' చరిత్ర ఇది ! లాక్కెళ్లిన ఖాకీ !

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్న అనేకమంది రచయితలు, సాహితీవేత్తలు, చరిత్రకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. బెంగుళూరులో గురువారం ఉదయం దాదాపు 20, 30 మంది ప్రముఖులను బలవంతంగా వారు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. వీరిలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ కూడా ఒకరు. మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న ఆయనను ఒక పోలీసు బలవంతంగా ఈడ్చుకువెళ్లి దగ్గరలో ఉన్న తమ ‘ పోలీస్ బస్సు ‘ ఎక్కించాడు. మరికొంతమంది ఆయనను బస్సులోపలికి నెట్టివేశారు. ఇక్కడ 144 సెక్షన్ అమలులో ఉందని, ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువమంది గుమికూడడం చట్టవిరుధ్ధమని ఖాకీలు అంటున్నారు. కాగా.. గాంధీజీ పోస్టర్ ను పట్టుకున్నందుకు, రాజ్యాంగం గురించి ప్రస్తావించినందుకు తనను అరెస్టు చేశారని పేర్కొన్న రామచంద్ర గుహ.. ‘ అసలు చూడండి.. ఇక్కడ ఏమైనా హింస జరుగుతోందా ‘ ? అని ప్రశ్నించారు. మాట్లాడుతుండగానే ఆయనను పోలీసులు చొక్కా పట్టుకుని లాక్కుపోవడం గమనార్హం. అటు-నగరంలో ఆంక్షలు విధించడాన్ని సీఎం ఎదియురప్ప సమర్థించారు. అసలు ఈ నిరసనల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించిన ఆయన.. ముస్లిముల రక్షణ, భద్రత తమ బాధ్యత అని, శాంతియుతంగా ఉండాలని అందరినీ కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ నేతలు నిరసనకారులకు మద్దతునిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.