సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు!

|

Feb 02, 2020 | 12:26 PM

Hike To Daily Wage Workers: గ్రాడ్యుయేట్లు, రోజు వారీ కూలీలు, క్లర్క్‌లు, సూపర్‌వైజర్లకు.. ఇలా పలు రంగాల్లో పని చేస్తున్న వేతన జీవులందరికి గొప్ప శుభవార్తను అందిస్తూ మూడేళ్ళ క్రిందట ఢిల్లీ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు కానుంది. 2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో కార్మికులకు 37% ఇన్‌క్రిమెంట్‌ను పెంచుతూ ఓ నోటిఫికేషన్‌ను […]

సుప్రీం కోర్టు సంచలన తీర్పు.. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు!
Follow us on

Hike To Daily Wage Workers: గ్రాడ్యుయేట్లు, రోజు వారీ కూలీలు, క్లర్క్‌లు, సూపర్‌వైజర్లకు.. ఇలా పలు రంగాల్లో పని చేస్తున్న వేతన జీవులందరికి గొప్ప శుభవార్తను అందిస్తూ మూడేళ్ళ క్రిందట ఢిల్లీ గవర్నమెంట్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశాలను జారీ చేసింది. దీనితో ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ.19 వేలు కానుంది.

2017వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం వివిధ రంగాల్లో కార్మికులకు 37% ఇన్‌క్రిమెంట్‌ను పెంచుతూ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే ఈ పెంపు వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్రంలో అనేక సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇలా రెండేళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న ఈ కేసుకు చివరికి మోక్షం దక్కింది.

తాజాగా మార్చి 3, 2017 నాటి నోటిఫికేషన్‌ను అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకపై గ్రాడ్యుయేట్లకు కనీస వేతనం రూ. 19,572 అందనుంది. అంతేకాక ఈ కేసుకు వ్యతిరేకంగా నమోదైన అపీల్స్ అన్నింటిపై త్వరగా విచారణ చేపట్టి పరిష్కరించాలని హైకోర్టును సూచించింది. ఇక ఈ విజ్ఞప్తులను వివిధ సంస్థలు, ఫ్యాక్టరీ‌ల ఓనర్లు దాఖలు చేశారు. ఆ నోటిఫికేషన్‌లో అనేక నోటిఫైడ్ జాబ్స్‌కు కనీస వేతనాలను నిర్ణయించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికులు అందుకుంటున్న వేతనాలను పూర్తిగా సవరించారు. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి..

# నైపుణ్యం లేని కార్మికుడికి – నెలకు రూ.14,842/- 

# సెమీ స్కిల్డ్ వర్కర్‌కి – రూ.16,341/-

# స్కిల్డ్ వర్కర్‌కి  – రూ.17,991/- 

అలాగే క్లర్క్‌లు, సూపర్‌వైజర్లల పోస్టుల్లో ఉన్నవాళ్లకు కనీస వేతనాలు..

# 10వ తరగతి పాసైతే – రూ.16,341/-

# ఇంటర్మీడియట్ విద్యార్హతకు – రూ.17,991/-

# డిగ్రీ, ఆపై విద్యార్హత – రూ.19,572/-