దారుణంః భార్య తల నరికి.. ఆ తర్వాత రోడ్డుపై ఇలా..!
Brutality Of A Husband: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్న గొడవ కారణంగా మనస్పర్థలు తలెత్తడంతో ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తన భార్య తల నరికి.. దాన్ని చేతితో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగిరాబాద్ పీఎస్ పరిధిలోని బహదుర్‌పూర్ గ్రామంలో అఖిలేష్ రావత్ అనే వ్యక్తి తన భార్య రజినీతో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నాడు. వీరికి ఓ పాప. ఆమెను దంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా […]
Brutality Of A Husband: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. చిన్న గొడవ కారణంగా మనస్పర్థలు తలెత్తడంతో ఓ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా తన భార్య తల నరికి.. దాన్ని చేతితో పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. జహంగిరాబాద్ పీఎస్ పరిధిలోని బహదుర్‌పూర్ గ్రామంలో అఖిలేష్ రావత్ అనే వ్యక్తి తన భార్య రజినీతో కలిసి కొంతకాలంగా నివసిస్తున్నాడు. వీరికి ఓ పాప. ఆమెను దంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా చూసుకునేవారు.
అయితే ఆ పాప అనారోగ్యం కారణంగా కొద్దిరోజుల క్రితం మృతి చెందింది. దీనితో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలోనే శనివారం ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దానితో కోపం తెచ్చుకుని అఖిలేష్ తన భార్యను ఇంటి బయటికి ఈడ్చుకొచ్చి పదునైన కొడవలితో తలని నరికి చంపేశాడు. అంతటితో ఆగకుండా ఆమె తలను పట్టుకుని ఆ ఏరియాలో తిరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని అఖిలేష్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అతడు వారితో గొడవ పడి తప్పించుకున్నాడు.
అయితే చివరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలను స్వాధీనం చేసిన అఖిలేష్ జరిగిన విషయాన్ని వివరించి లొంగిపోయాడు. అంతేకాక జాతీయ గీతాన్ని కూడా ఆలపించాడు. అఖిలేష్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్పీ.. తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవే హత్యకు దారి తీసి ఉంటుందని ఆయన అన్నారు.