ఏలూరు ఘటనపై హైపవర్ కమిటీ..తగ్గిన బాధితుల సంఖ్య.. లోతైన అధ్యాయనం చేస్తున్న ఎయిమ్స్..
ఏలూరు వింత రోగానికి కారణాలు ఇంకా తెలియకపోయినా.. బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే పలు జాతీయ సంస్థలు కూడా ముమ్మరంగా పరిశోధనలు చేస్తుండడంతో..

ఏలూరు వింత రోగానికి కారణాలు ఇంకా తెలియకపోయినా.. బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే పలు జాతీయ సంస్థలు కూడా ముమ్మరంగా పరిశోధనలు చేస్తుండడంతో.. రేపటి వరకు వ్యాధినిర్ధారణయ్యే అవకాశాలున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
ఏలూరు విషాదంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్న ఏయిమ్స్.. ఇవాళ ఫలితాలను వెల్లడించే అవకాశముంది. రక్త నమూనాల్లో సీసం, నికెట్‌ను గుర్తించిన అధికారులు.. ఆర్గానోక్లోరిన్స్ కూడా ఉండొచ్చన్న అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ జీవీఎల్ చొరవతో.. CFSL నిపుణులు ఆ దిశగా పరీక్షిస్తున్నారు.
ఇక ఏలూరు బాధితులను గురువారం పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని.. ఈ ఘటనపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బాధితులకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. మృతిచెందిన ఇద్దరు వింతవ్యాధితో చనిపోలేదన్న మంత్రి నాని.. వేర్వేరు కారణాలతో చనిపోయారన్నారు.




