పీకల్లోతు కష్టాల్లో ఫేస్ బుక్.. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో కేసులు.. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ అమ్మకం తప్పదా?
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. అమెరికన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్ ఫేట్ మారుతోంది.. ఇంతకాలం తిరుగులేకుండా ఏకచత్రాధిపత్యంగా టెక్ రంగాన్ని ఏలిన కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్‌ను కష్టాలు చుట్టుముట్టాయి. అమెరికన్ ఐటీ దిగ్గజ కంపెనీ ఫేస్ బుక్ ఫేట్ మారుతోంది.. ఇంతకాలం తిరుగులేకుండా ఏకచత్రాధిపత్యంగా టెక్ రంగాన్ని ఏలిన కంపెనీకి కష్టాలు మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ సహా 48 రాష్ట్రాల్లో లా సూట్స్ పడ్డాయి. ప్రభుత్వాలే వీటిని వేయడం విశేషం. కంపెనీ యాంటీ కాంపిటీటివ్ కాండక్ట్ కింద కేసులు వేశారు.
ఫేస్ బుక్ ఓ ప్రణాళిక ప్రకారం ప్రత్యర్ధి, మరియు చిన్న కంపెనీలను చంపేస్తూ.. లేదా టేకొవర్ చేస్తూ మోనోపలీగా వ్యవహరిస్తుంది. చాలా కంపెనీలను టేకొవర్ చేసింది. ఇందులో భాగంగా 2012లో ఇన్ స్టాగ్రామ్, 2014లో వాట్సాప్ లను ఇలాగే టేకొవర్లు చేసిందని కేసులో పేర్కొన్నారు.
తమకు పోటీ ఉండకూడదన్న ఉద్దేశం కంపెనీలో ఉందన్నారు. వినియోగదారులకు సోషల్ నెట్ వర్కింగ్ లో రకరకాలు అవకాశాలు అందుబాటులో లేకుండా చేసింది. దశాబ్ధ కాలంగా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మోనోపలితో మార్కెట్ ను శాసిస్తుంది.
మొత్తానికి అందరి తలరాతలు రాస్తున్న ఫేస్ బుక్ జాతకం ఇప్పుడు కోర్టు కేసుల్లో ఉంది. తీర్పు ప్రతికూలంగా వస్తే తన చేతిలో ఉన్న వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి కంపెనీలను విక్రయించాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. మొత్తానికి తాజా వివాదం యూఎస్ తో పాటు.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనుంది.