గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో కాలిబుడిదైన భారీ షెడ్డు
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దుండిగల్‌లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు..
Massive Fire : హైదరాబాద్ శివారు ప్రాంతంలోని దుండిగల్‌లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిడటంతోపాటు పొగ కూడా వస్తుండటంతో మంటలు ఆర్పేందుకు సమయం పట్టింది.
అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.