మృతదేహాలకు కరోనా టెస్టులు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కాగా.. గతంలో సదరు టెస్టులు

మృతదేహాలకు కరోనా టెస్టులు.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
Follow us

| Edited By:

Updated on: May 14, 2020 | 1:24 PM

Telangana Government: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో మృతదేహాలకు కరోనా టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. కాగా.. గతంలో సదరు టెస్టులు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. టెస్టులు చేయకపోతే కరోనా విస్తరణలో 3rd స్టేజీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు.

మరోవైపు.. నెల్లూరు, కర్నూలు పట్టణాల్లో వ్యాధిగ్రస్తులు చనిపోయిన తరువాత పరీక్షలు నిర్వహిస్తేనే కరోనా బయటపడిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. WHO తో పాటు వివిధ సంస్థలు ఇచ్చిన గైడ్‌లైన్స్ పాటించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రూల్స్ ఫాలో అవుతుందో.. నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 26 వరకు మరో స్ఫష్టమైన నివేదిక అందివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది.

Also Read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!