ఎన్నికల వేళ.. డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడు

మధ్యప్రదేశ్ : డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంపాతీయ ఉయే కుమారుడు సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండ్ల టౌన్ లో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సత్యేంద్రకు చెందిన హోండా బ్రియో కారులో 3.380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని పోలీసు అధికారులు తెలిపారు. కారులో సత్యేంద్రతో పాటు అతని స్నేహితులు షారుఖ్, అభిషేక్ లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:57 am, Thu, 14 March 19
ఎన్నికల వేళ.. డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడు

మధ్యప్రదేశ్ : డ్రగ్స్ కేసులో బీజేపీ ఎంపీ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంపాతీయ ఉయే కుమారుడు సత్యేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండ్ల టౌన్ లో పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలలో సత్యేంద్రకు చెందిన హోండా బ్రియో కారులో 3.380 గ్రాముల 41 హెరాయిన్ ప్యాకెట్లు లభించాయని పోలీసు అధికారులు తెలిపారు. కారులో సత్యేంద్రతో పాటు అతని స్నేహితులు షారుఖ్, అభిషేక్ లు కూడా ఉన్నారని.. వారిపై కూడా కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ అరెస్ట్ వ్యవహారం మధ్యప్రదేశ్ లో రాజకీయంగా దుమారం రేపుతోంది.