విజయ్‌కి ఐటీ శాఖ మరో షాక్.. ఎంక్వైరీకి డుమ్మా కొట్టిన హీరో!
హీరో విజయ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోన్నాయి. ఇప్పుడు ప్రస్తుం తళపతి విజయ్‌కి మరోసారి షాక్ ఇస్తూ.. సమన్లు జారీ చేసింది ఐటీ శాఖ. హీరో విజయ్‌తో పాటు ‘బిగిల్’ సినిమా ఫైనాన్సియర్ అన్బు చెజియన్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. గత మూడు రోజులుగా ‘బిగిల్’ సినిమా నిర్మాణ సంస్థల్లో కూడా ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా […]
హీరో విజయ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతోన్నాయి. ఇప్పుడు ప్రస్తుం తళపతి విజయ్‌కి మరోసారి షాక్ ఇస్తూ.. సమన్లు జారీ చేసింది ఐటీ శాఖ. హీరో విజయ్‌తో పాటు ‘బిగిల్’ సినిమా ఫైనాన్సియర్ అన్బు చెజియన్ కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేశారు.
గత మూడు రోజులుగా ‘బిగిల్’ సినిమా నిర్మాణ సంస్థల్లో కూడా ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఏజీఎస్ సంస్థ వద్ద రూ.300 కోట్లకు పైగా నగదుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అలాగే నిర్మాత అన్బు చెజియాన్ ఇంట్లో ఐటీ సోదాలు చేయగా రూ. 77 కోట్ల అక్రమ నగదు స్వాధీన పరుచుకున్నారు. అయితే నగదుపై నేరుగా విచారణకు హాజరు కావాలని సినీ నటుడు విజయ్, అన్బు చెజియాన్‌కి సమన్లు జారీ చేసింది ఐటీ శాఖ.
అయితే ఐటీశాఖ విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు నటుడు విజయ్. తాను ‘మాస్టర్’ చిత్రం షూటింగ్‌లో ఉన్నందున వ్యక్తిగతంగా హాజరుకాలేనని హీరో విజయ్ తెలిపారు.