మంచిమనసు చాటుకున్న మెగా మేనల్లుడు.. వృద్దాశ్రమాన్ని ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలో 'సోలో బ్రతుకే సోబెటర్' సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ నాభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మంచిమనసు చాటుకున్న మెగా మేనల్లుడు.. వృద్దాశ్రమాన్ని ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్
మంచిమనసు చాటుకున్న మెగా మేనల్లుడు.. వృద్దాశ్రమాన్ని ప్రారంభించిన సాయి ధరమ్ తేజ్
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2020 | 3:51 PM

మెగా హీరో సాయిధరమ్ తేజ్ త్వరలో ‘సోలో బ్రతుకే సోబెటర్’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల భామ నాభ నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగా హీరో గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తదైన గుర్తింపు కోసం సాయి తేజ్ ప్రయత్నిస్తున్నాడు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ విజయాలను సొంతం చేసుకుంటున్నాడు తేజ్. ఇక మంచి మనసు చాటుకోవడంలోనూ ఈ హీరో నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

సెలబ్రెటీలు ఇప్పటికే పలు సేవాకార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ బ్లెడ్ బ్యాంక్ ద్వారా సేవలందిస్తుంటే.. సూపర్ స్టార్ మహేష్ చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు. ఇలా చాలామంది హీరోలు ఉన్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా వృద్దులకు అండగా నిలబడ్డాడు. గతంలో సోషల్ మీడియాలో వృద్దాశ్రమం కోసం అభ్యర్థిస్తున్న ఓ పోస్ట్ కు స్పందిస్తూ సాయిధరమ్ తేజ్ వారికి అండగా ఉంటానని మాటిచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకుంటూ.. వృద్దులకోసం ఓ నూతన బిల్డింగ్ ను కట్టించిఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం విజయవాడలో వృద్దాశ్రమాన్నిప్రారంభించాడు సాయిధరమ్‌. గొప్ప మనసుతో తమకు అండగా నిలుస్తున్న సాయిధరమ్ కు వృద్దులంతా దీవెనలు అందించారు. ఈ యంగ్ హీరో గొప్పమనసుకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.