New Tax Regime: ఉద్యోగులు పన్ను ఆదా చేయడం ఎలా? కొత్త ట్యాక్స్ విధానంలో మార్పులేంటి? పూర్తి వివరాలు..

|

Mar 29, 2023 | 12:17 PM

2023బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన కొత్త ట్యాక్స్ పాలసీ గురించి ఉద్యోగులు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఈ విధానంలో పన్నులు ఎలా సేవ్ చేసుకోవాలి? దీనిపై ఆర్థిక నిపుణులు అందిస్తున్న సూచనలు తెలుసుకుందాం రండి..

New Tax Regime: ఉద్యోగులు పన్ను ఆదా చేయడం ఎలా? కొత్త ట్యాక్స్ విధానంలో మార్పులేంటి? పూర్తి వివరాలు..
Tax Savings
Follow us on

ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో ముగిసిపోనుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. ఆర్థిక పరమైన అంశాలు చాలా వాటిల్లో మార్పులుంటాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపు దారులు మారిన విధానాలను తెలుసుకోవాలి. ఇటీల జరిగిన బడ్జెట్-2023 సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రకటించారు. ఇది కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే అమలులోకి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు కొత్త పన్ను విధానంలో కాస్త వెసులుబాటును కేంద్రం ప్రకటించింది. అయితే ఉద్యోగులు పాత పన్ను విధానాన్ని కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2023బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించిన కొత్త ట్యాక్స్ పాలసీ గురించి ఉద్యోగులు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఈ విధానంలో పన్నులు ఎలా సేవ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కొత్త పన్ను విధానం..

2023-24 బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పన్ను విధానం ప్రకారం రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తాజా మార్పులతో రూ.3 లక్షల వరకు ఉన్న ఇన్‌కమ్‌పై ఎలాంటి పన్ను విధించరు. రూ.3లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఇన్‌కమ్‌పై 5 శాతం పన్ను ఉంటుంది. రూ.6- రూ.9 లక్షలకు 10 శాతం, రూ.9లక్షల నుంచి రూ.12 లక్షలపై 15 శాతం, రూ.12లక్షల నుంచి రూ.15 లక్షలకు 20 శాతం పన్ను విధిస్తారు. రూ. 15 లక్షలు ఆపైన ఆదాయం ఉంటే 30 శాతం పన్ను ఉంటుంది. అంతేకాకుండా కొత్త పన్ను విధానంలో రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ని ప్రభుత్వం ప్రకటించింది.

పన్ను ఆదా చేయాలంటే..

ఉద్యోగులు పన్ను ఆదా చేసుకోవాలంటే కొన్ని అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. పన్ను మినహాయింపును అందించే కొన్ని పథకాలలో పెట్టుబడులు పెట్టడం మంచి ఆప్షన్ అని సూచిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయంపై రూ.7 లక్షల వరకు ఎగ్జమ్షన్‌ ప్రకటించింది. రూ.50,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ అందుబాటులో ఉంది. అంటే రూ.7.5 లక్షలకు ఎగ్జమ్షన్‌ పొందుతున్నట్లు భావించాలి. ఇంతకు మించి కావాలంటే మాత్రం కొన్ని పథకాలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.

ఇవి కూడా చదవండి
  • పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80 సీసీడీ(2) ని ఉపయోగించుకోవచ్చు. ఈ సెక్షన్ ఆదాయ పన్ను నుంచి 10 శాతం వరకు బేసిక్‌ శాలరీతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌ను మినహాయిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతంగా ఉంది. కొత్త పన్ను విధానంలో శాలరీలో 12 శాతంగా చేస్తున్న ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌లు కూడా పన్ను పరిధిలోకి రావు.
  • కొత్త పన్ను విధానం ఉపయోగించాలని భావిస్తున్న ఉద్యోగులు పోర్ట్‌ఫోలియోను పునర్నిర్మించాలి. ఇంతకుముందు పీపీఎఫ్ ను ఎక్కువగా ట్యాక్స్‌ సేవింగ్‌ ఆప్షన్‌గా భావించేవారు. కొత్త నిబంధనల ప్రకారం, పీపీఎఫ్ కంట్రిబ్యూషన్‌లు పన్ను పరిధిలోకి వస్తాయి.
  • ఉద్యోగులు ట్యాక్స్‌ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ కమ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను పరిశీలించవచ్చు. ముఖ్యంగా హై నెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌కి పన్ను ఆదా చేయడంలో ఉపయోగపడతాయి. అయితే యులిప్ పాలసీలు ఇప్పటికీ పన్ను పరిధిలోకి వస్తాయని గమనించాలి.
  • ప్రాపర్టీలను అద్దెకు ఇచ్చిన ఉద్యోగులు యాన్యువల్‌ ప్రాపర్టీ వ్యాల్యూలో 30 శాతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు. ఇదే క్రమంలో ఫైనాన్షియల్‌ బిల్‌ 2023కి ప్రభుత్వం సవరణలు తీసుకువచ్చింది. వార్షిక ఆదాయం రూ.7 లక్షల కంటే తక్కువగా ఉన్న పన్ను చెల్లింపుదారులకు ‘మార్జినల్‌ రిలీఫ్’ ఇచ్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..