కాలిఫోర్నియాలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వెళ్లిన ఓ హెలికాప్టర్ ప్రమాదవషాత్తు కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న పైలట్ మృతి చెందారు. దక్షిణ కోలింగాలోని వెస్ట్రన్స్ ఫ్రెస్నో ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా కార్చిచ్చు చెలరేగింది. ఈ మంటలను ఆర్పేందుకు హెలికాప్టర్లను ఉపయోగించారు. బెల్ యూహెచ్-1 హెచ్ హెలికాప్టరుతో.. కార్చిచ్చును ఆర్పేందుకు నీటితో పంపించారు. అయితే మంటలను ఆర్పుతుండగా.. హెలికాప్టర్ కుప్పకూలింది. సాంకేతిక సమస్యతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, కార్చిచ్చు చెలరేగుతున్న సమీప ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Read More :
ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్ కేసులు