వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణకు మూడు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

వాతావరణ శాఖ హెచ్చరిక.. తెలంగాణకు మూడు రోజులు భారీ వర్షాలు..

Updated on: Sep 12, 2020 | 6:08 PM

Rains In Telangana: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా 5.8 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్న షేర్ జోన్ వల్ల ఈ రోజు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని రాజారావు అన్నారు. సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు ,భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…