చురుగ్గా నైరుతి.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..

ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే

  • Publish Date - 5:44 am, Thu, 9 July 20 Edited By:
చురుగ్గా నైరుతి.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..

Heavy rains forecast: ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే రాష్ట్రంలో ప్రవేశించాయి. ప్రస్తుతం తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, మెదక్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో పలుచోట్ల నేడు, రేపు భారీవర్షాలు కురిసే అవకాశమున్నట్టు వెల్లడించారు.

Also Read: బ్రెజిల్‌లో కరోనా బీభత్సం.. ఒక్కరోజే 45 వేలకు పైగా..