ఉత్తరాంధ్రకు అలెర్ట్..నేడు భారీ వర్షాలు..

రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఏపీలో విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మ‌రోవైపు షియర్‌ జోన్‌ ప్రభావం కూడా తోడ‌వ్వ‌డంతో అధిక వ‌ర్షపాతం న‌మోద‌వుతోంది. ఇక‌ ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఆవ‌రించి ఉంది.

ఉత్తరాంధ్రకు అలెర్ట్..నేడు భారీ వర్షాలు..

Updated on: Jul 15, 2020 | 9:35 AM

రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో ఏపీలో విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. మ‌రోవైపు షియర్‌ జోన్‌ ప్రభావం కూడా తోడ‌వ్వ‌డంతో అధిక వ‌ర్షపాతం న‌మోద‌వుతోంది. ఇక‌ ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో 3.6 నుంచి 4.5 కి.మీ ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఆవ‌రించి ఉంది.

మ‌రోవైపు నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు కురుస్తాయ‌ని వివ‌రించింది. బుధవారం ఉత్తర కోస్తా, యానాం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది. 18వ తేదీన రాయలసీమలోని కొన్ని ప్రాంతాల‌లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌లో న‌మోదైన వ‌ర్షపాతం వివ‌రాలు..

తిరువూరు 17 సెం.మీ
విశాఖపట్నం 10 సెం.మీ,
చోడవరం 8 సెం.మీ
ధవళేశ్వరం 7 సెం,మీ
పిడుగురాళ్ల, తణుకు, కందుకూరు 6 సెం.మీ
బద్వేల్, ఆత్మకూరు, అవనిగడ్డ, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి, సంతమాగులూరు, బొబ్బిలి 5 సెం.మీ