AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకలతో స్నేహం చేసిన పులి… ఎందుకో తెలుసా…

అడవికి ‘రారాజు సింహం’.. అయినా అదే అడవికి నియంత ‘పెద్ద పులి’. అదంటేనే అడవికి భయం.. వేట దాని సహజ నైజం. కానీ అది తన సహజ గుణాన్ని కాసుపు పక్కన పెట్టిందో.. లేక మరిచిపోయిందో తెలియదు కాని.. మేకల మంద ఉంటున్న పాకలో.. మేకల పక్కనే తలదాచుకుంది. అసోంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. దీనికి తోడు అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షారంభంలోనే ఇంత స్థాయిలో […]

మేకలతో స్నేహం చేసిన పులి... ఎందుకో తెలుసా...
Sanjay Kasula
|

Updated on: Jul 15, 2020 | 9:50 AM

Share

అడవికి ‘రారాజు సింహం’.. అయినా అదే అడవికి నియంత ‘పెద్ద పులి’. అదంటేనే అడవికి భయం.. వేట దాని సహజ నైజం. కానీ అది తన సహజ గుణాన్ని కాసుపు పక్కన పెట్టిందో.. లేక మరిచిపోయిందో తెలియదు కాని.. మేకల మంద ఉంటున్న పాకలో.. మేకల పక్కనే తలదాచుకుంది. అసోంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అసోం అతలాకుతలం అవుతోంది. దీనికి తోడు అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. వర్షారంభంలోనే ఇంత స్థాయిలో నదులు ప్రవహించడం ఇదే తొలి సారి. నదుల ఉధృతికి అక్కడి గ్రామాలకు గ్రామాలు కొట్టుకపోతున్నాయి. వరద నీరు గ్రామాలలోకి ప్రవేశిండంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రాణ నష్టం తగ్గించేందుకు అక్కడి అధికారులు వేగంగా పనిచేస్తున్నారు.

ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు.. మూగ జీవాలను రక్షించుకోలేక పోతున్నారు. అయితే రక్షించుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామాలు పూర్తిగా వరద నీటితో నీటమునిగాయి.

ఇక వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తున్న కజిరంగా అభయారణ్యం కూడా వరద నీటిలో చిక్కుకుంది. దాంతో అక్కడున్న జీవజాతులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెడుతున్నాయి. కొన్ని పెద్దపులులు ప్రాణాలు నిలుపుకునేందుకు తలో దిక్కుకు వెళ్లిపోయాయి. వాటిలో ఒకటి కంధూలిమారి గ్రామంలోకి ప్రవేశించింది. అప్పటికే గ్రామం మొత్తం సురక్షిత ప్రాంతాలకి తరలివెళ్లడంతో గ్రామంలో ఎవరూ లేరు. కమల్ శర్మ అనే వ్యక్తికి చెందిన మేకల కొట్టంలో ప్రవేశించిన ఆ పెద్దపులి.. బతుకుజీవుడా అనుకుంటూ ఓ పక్కనే ఒదిగిపోయింది. అయితే సహజంగా మేక కనిపిస్తేనే దాడి చేసి మటన్ బిర్యాణీ చేసుకునే పెద్ద పులి. కనిపిస్తున్న మేకలను సైతం కన్నెత్తి చూడకుండా బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసింది.

ఆ మేకలకు మేత వేసేందుకు వెళ్లిన కమల్ శర్మ తల్లి అక్కడ పులిని చూసి వణికిపోయారట. మేకల మధ్య అదేమిటో అనుకుని దాన్ని తాకి చూసిన ఆమెకు ఒళ్లు గగుర్పొడిచిందట. ఇంట్లోకి వచ్చిన 15 నిమిషాల వరకు ఆమెకు వణుకు తగ్గలేదని శర్మ వెల్లడించారు. ఆ పులిని తామందరం చూశామని, ఎంతో అలసిపోయి పడుకుందని భావించామని వివరించారు. తెల్లవారడంతోనే ఆ పులి వెళ్లిపోయిందని శర్మ తెలిపాడు.