AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌: హెచ్‌డీఎఫ్‌సీ

ఆర్థిక సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబయి శివారులోని ఓ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌ను అమ్మకానికి పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ. 414.80కోట్ల మేర అప్పుగా ఉంది. ముంబయి శివారులోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ) నాలుగో అంతస్తులో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఓ ఆఫీస్‌ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రుణాలు పొందే సమయంలో ఈ ఆఫీస్‌ను జెట్‌ తనఖా కింద […]

అమ్మకానికి జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌: హెచ్‌డీఎఫ్‌సీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 09, 2019 | 8:21 PM

Share

ఆర్థిక సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇచ్చిన రుణాలను రికవరీ చేసుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబయి శివారులోని ఓ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌ను అమ్మకానికి పెట్టింది.

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ రూ. 414.80కోట్ల మేర అప్పుగా ఉంది. ముంబయి శివారులోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌(బీకేసీ) నాలుగో అంతస్తులో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఓ ఆఫీస్‌ ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి రుణాలు పొందే సమయంలో ఈ ఆఫీస్‌ను జెట్‌ తనఖా కింద పెట్టింది. ‘బకాయిలు చెల్లించడంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ విఫలమైంది. దీంతో నిబంధనల ప్రకారం.. ఆ కంపెనీ తనఖా కింద పెట్టిన స్థిరాస్తిపై మాకు హక్కు లభించింది’ అని హెచ్‌డీఎఫ్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫీస్‌ను రూ. 245 కోట్ల రిజర్వ్‌ ధరతో హెచ్‌డీఎఫ్‌సీ ఇ-వేలానికి పెట్టింది.