దేశవ్యాప్తంగా మొదలైన ‘కోవ్యాక్సిన్’ తుది దశ ట్రయల్స్‌.. తొలి వాలంటీర్‌గా టీకా తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి

ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైంది.

దేశవ్యాప్తంగా మొదలైన ‘కోవ్యాక్సిన్’ తుది దశ ట్రయల్స్‌.. తొలి వాలంటీర్‌గా టీకా తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 20, 2020 | 4:37 PM

ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాల్లో వాలంటీర్‌గా హర్యానా ఆరోగ్య మంత్రి భాగస్వామ్యం అయ్యారు. ఈ ప్రయోగాలకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ తొలి వాలంటీర్‌గా టీకా తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అనిల్‌ విజ్‌కు వైద్యులు ట్రయల్‌ డోస్‌ ఇచ్చారు. హర్యానా రాష్ట్రంలో ప్రారంభం కానున్న భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు.. తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (DGCI) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో.. 26వేల మంది వాలంటీర్లపై నిర్వహిస్తున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?