కర్ర సాము చేసి అదరగొట్టిన ముఖ్యమంత్రి.. సోషల్ మీడియాలో వీడియో తెగ వైర‌ల్

ఆయన ఓ ముఖ్యమంత్రి.. పాలనలోనే కాదు కర్ర సాము చేయడంలోనూ దిట్ట. అది కర్రైనా, కత్తైనా ఇట్టే తిప్పేయగలడు. మార్షల్ ఆర్ట్స్‌లో తనకున్న ప్రతిభను ప్రదర్శించాడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.

కర్ర సాము చేసి అదరగొట్టిన ముఖ్యమంత్రి.. సోషల్ మీడియాలో వీడియో తెగ వైర‌ల్
Haryana Cm Manohar Lal Khat

Updated on: Apr 25, 2022 | 2:04 PM

ఆయన ఓ ముఖ్యమంత్రి.. పాలనలోనే కాదు కర్ర సాము చేయడంలోనూ దిట్ట. అందుకే సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను తన రాష్ట్రంలోని వివిధ క్రీడా పోటీలలో చేర్చారు. అయితే.. అది కర్రైనా, కత్తైనా ఇట్టే తిప్పేయగలడు. మార్షల్ ఆర్ట్స్‌లో తనకున్న ప్రతిభను ప్రదర్శించాడు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(CM Manohar Lal Khattar). ఖట్టర్ సిక్కులకు సంబంధించిన సాంప్రదాయ యుద్ధ కళ అయిన ‘గట్కా’లో(Gatka) సిద్ధహస్తుడు. కర్రను అద్భుతంగా తిప్పుతూ తన సత్తా చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సాంప్రదాయ మార్షల్‌  ఆర్ట్స్‌లో ముఖ్యమంత్రి ఎలా పాల్గొన్నారో ఈ వీడియోలో చూడవచ్చు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్  యుద్ధాలకు ప్రసిద్ధి చెందిన పానిపట్ నగరంలో తనలోని కళను ప్రదర్శించారు. సిక్కు గురువు శ్రీ తేజ్ బహదూర్ 400వ ప్రకాష్ పర్వ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను చారిత్రాత్మకంగా సిక్కులతో ముడిపడి ఉన్న సాంప్రదాయ యుద్ధ కళ అయిన ‘గట్కా’ (గట్కా) వద్ద తన చేతిని ప్రయత్నించాడు. గట్కా అనేది ఆయుధ ఆధారిత యుద్ధ కళ, సిక్కు వీరులు తమ యుద్ధాలలో ఉపయోగించారు.

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ఆయుధ ఆధారిత సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను తన రాష్ట్రంలోని వివిధ క్రీడా పోటీలలో చేర్చారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2021లో పంజాబీ మార్షల్ ఆర్ట్ గట్కా కూడా చేర్చారు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..