AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్లే-డేవిడ్సన్ కు కరోనా సెగ.. 700 ఉద్యోగాలు కట్‌..

యూఎస్ కు చెందిన ప్రపంచ ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది.

హార్లే-డేవిడ్సన్ కు కరోనా సెగ.. 700 ఉద్యోగాలు కట్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 11, 2020 | 7:25 AM

Share

యూఎస్ కు చెందిన ప్రపంచ ప్రసిద‍్ధ బైక్స్‌ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను  తొలగించనున్నామని ప్రకటించింది. ‘ది రివైర్’  పేరుతో హార్లే-డేవిడ్సన్ ఉద్యోగ కోతలు, పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణం లో భాగంగా 700మంది తొలగించనున్నామని, వీరిలో 200మంది ఇప్పటికే నిష్క్రమించగా, మిగిలిన 500మందిని 2020 చివరి నాటికి తొలగించాలని భావిస్తున్నామని కంపెనీ తెలిపింది.

ఈ చర్యల ద్వారా కంపెనీకి 42 మిలియన్ల డాలర్లు ఖర్చు ఆదా అవుతుంది. హార్లే-డేవిడ్సన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ ఒలిన్ సంస్థకు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో  తాత్కాలిక ప్రాతిపదికన డారెల్ థామస్‌ను ఎంపిక చేసింది. హార్లే-డేవిడ్సన్‌ను విజయవంతమైన మార్గంలో తీసుకురావడానికి గణనీయమైన మార్పులు అవసరం, అందుకు సరికొత్త దశలో కృషి జరుగుతోందని, మొత్తం కంపెనీ అంతటా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని  హార్లే-డేవిడ్సన్ సీఈఓ జోచెన్ జైట్జ్ ప్రకటించారు.  కాగా ప్రపంచవ్యాప్తంగా హార్లేలో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Follow Us
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
దుష్టులతో వాదనలు వద్దు... దూరంగా ఉండటమే తెలివి!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే!
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా కలిసి పోరాడుతాంః జగన్
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
గ్యాస్‌తో పనే లేదు.. ఛార్జింగ్ స్టౌలు వచ్చేసాయి..
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?
40 డిగ్రీలకే కరుగుతున్న రోడ్లు.. భారత్‌లో 45 డిగ్రీలు దాటినా ఎలా?