హజ్ యాత్రకు అనుమతి.. కానీ షరతులు వర్తిస్తాయి..

కరోనా వైరస్ ప్రభావం అన్ని ప్రార్థనా మందిరాలపై పడింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాను దర్శించుకునే వారిపై అంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ సారి పది వేల మంది యాత్రికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది సౌదీ ప్రభుత్వం.

  • Balaraju Goud
  • Publish Date - 9:12 pm, Mon, 27 July 20
హజ్ యాత్రకు అనుమతి.. కానీ షరతులు వర్తిస్తాయి..

కరోనా వైరస్ ప్రభావం అన్ని ప్రార్థనా మందిరాలపై పడింది. ఈ నేపధ్యంలో ఈ ఏడాది హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మక్కాను దర్శించుకునే వారిపై అంక్షలు విధించింది. పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. ఈ సారి పది వేల మంది యాత్రికులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది సౌదీ ప్రభుత్వం. వీరిలో విదేశీయుల నుంచి వచ్చే వారు 70 శాతం మంది కాగా, స్వదేశీయులు 30 శాతం మంది మాత్రమే ఉండనున్నారు. అందులోనూ పరిమిత దేశాల నుంచి వచ్చే వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది

ఇక… కేవలం 160 దేశాలకు చెందిన వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించనున్నారు. ఈ పవిత్ర యాత్ర సందర్భంగా అడుగడుగునా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సౌదీ సర్కార్ భావిస్తోంది. కరోనా నేపథ్యంలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తర్వియా రోజున… మక్కా నుంచి మీనాకు భక్తులు ప్రయాణించేందుకు ఎలాంటి అటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు ఆ దేశ వైద్య, ఆరోగ్య శాఖతో పాటు ఇతర శాఖల మధ్య పూర్తిస్థాయి సహకారముందని ప్రభుత్వం వెల్లడించింది.

ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈసారి యాత్రికుల్ని ఎంపిక చేశారు. ఎలాంటి పక్షపాతమూ లేకుండా… ఈ ప్రక్రియ జరిగినట్లు సౌదీ అధికారులు తెలిపారు. సరైన ఆరోగ్యం ఉన్నవారినే ఎంపిక చేసినట్లు వివరించారు. యాత్ర జరిగే సమయంలో భౌతిక దూరం పాటిస్తూ.. ముందుకుసాగేలా అనుమతిస్తామని తెలిపింది.