‘అవును, నేను కుక్కనే’, జ్యోతిరాదిత్య సింధియా సెటైర్
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా మధ్య మాటల యుధ్ధం మెల్లగా తారాస్థాయికి చేరుతోంది. తనను ఉద్దేశించి కమల్ నాథ్..కుక్క (డాగ్) అని వ్యాఖ్యానించిన విషయాన్ని సింధియా ప్రస్తావిస్తూ.. అవును, నేను కుక్కనే ! ప్రజలే నా యజమానులు, కుక్క తన యజమానిని రక్షిస్తూనే ఉంటుంది అన్నారు. అయితే సింధియాను కమల్ నాథ్ అలా ‘కుక్క’ అనలేదని, అసలు ఏ నాయకుడిని అలా అనలేదని ఆయన […]

మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా మధ్య మాటల యుధ్ధం మెల్లగా తారాస్థాయికి చేరుతోంది. తనను ఉద్దేశించి కమల్ నాథ్..కుక్క (డాగ్) అని వ్యాఖ్యానించిన విషయాన్ని సింధియా ప్రస్తావిస్తూ.. అవును, నేను కుక్కనే ! ప్రజలే నా యజమానులు, కుక్క తన యజమానిని రక్షిస్తూనే ఉంటుంది అన్నారు. అయితే సింధియాను కమల్ నాథ్ అలా ‘కుక్క’ అనలేదని, అసలు ఏ నాయకుడిని అలా అనలేదని ఆయన తరఫు ప్రతినిధి నరేంద్ర సలూజా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రతీ దేవిని కమల్ నాథ్. ‘ఐటెం’ అంటూ చేసిన వ్యాఖ్య తాలూకు రగడ ఇంకా సద్దు మణగక ముందే ఇప్పుడీ ‘కుక్క’ పద యవ్వారం మళ్ళీ కమల్ నాథ్ ని చిక్కుల్లో పడేసేట్టు ఉంది.