H1N1 Virus: ఆ ఇద్దరికీ వైరస్.. మూతబడ్డ ఆఫీసులు..!

| Edited By:

Feb 20, 2020 | 8:39 PM

H1N1 Virus: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్‌వేర్ గ్రూప్ కు చెందిన భారత సంస్థ ‘సాప్‌’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు […]

H1N1 Virus: ఆ ఇద్దరికీ వైరస్.. మూతబడ్డ ఆఫీసులు..!
Follow us on

H1N1 Virus: కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. ఈ క్రమంలో బెంగళూరు నగరంలో స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్‌వేర్ గ్రూప్ కు చెందిన భారత సంస్థ ‘సాప్‌’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్‌ ఫ్లూ కారక హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే పనిచేసే సదుపాయాన్ని కల్పించింది.

కొవిడ్‌-19 విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో సాప్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఫలితం పాజిటివ్‌ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్‌ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్‌, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది.

[svt-event date=”20/02/2020,8:32PM” class=”svt-cd-green” ]