దాడిపై జీవీఎల్ స్పందన..!

బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావుపై ఇవాళ మీడియా సమావేశంలో చెప్పుతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై జీవీఎల్‌ స్పందిస్తూ.. దాడి తనను ఉద్దేశించి జరిగింది కాదని అన్నారు. చెప్పు విసిరిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని జీవీఎల్ చెప్పారు. ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఈ దాడి వెనక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ […]

దాడిపై జీవీఎల్ స్పందన..!

Updated on: Apr 18, 2019 | 9:57 PM

బీజేపీ సీనియర్‌ నేత జీవీఎల్‌ నరసింహారావుపై ఇవాళ మీడియా సమావేశంలో చెప్పుతో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై జీవీఎల్‌ స్పందిస్తూ.. దాడి తనను ఉద్దేశించి జరిగింది కాదని అన్నారు. చెప్పు విసిరిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని జీవీఎల్ చెప్పారు. ఈ దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఈ దాడి వెనక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ పార్టీ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చెయ్యాలని ఆయన కోరారు.

ఇక దాడి చేసిన వ్యక్తి పేరు డాక్టర్ శక్తి భార్గవ్ అని.. 500 కోట్ల విలువైన ఆస్తులు కొన్నందుకే అతనిపై ఇటీవల ఐటీ దాడులు జరిగినట్లు తన దగ్గర సమాచారం ఉందని జీవీఎల్‌ వివరించారు.