వధువు లేని పెళ్లి.. ఇదో కన్నీటి కథ

వివాహమంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇటీవల గుజరాత్‌లో పెళ్లికూతురు లేకుండానే ఓ వివాహం ఘనంగా జరిగింది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం అందరి చేత కన్నీళ్లు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌కు చెందిన అజయ్ బరోత్(27) మానసిక వికలాంగుడు. చిన్నవయసులోనే తల్లిని కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఆ ఊరిలో ఎవరైనా పెళ్లి జరిగినప్పుడు.. అజయ్ డ్యాన్స్‌లు వేస్తూ బాగా ఎంజాయ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో తనకు ఎప్పుడు […]

వధువు లేని పెళ్లి.. ఇదో కన్నీటి కథ
Follow us

| Edited By:

Updated on: May 14, 2019 | 4:55 PM

వివాహమంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఇటీవల గుజరాత్‌లో పెళ్లికూతురు లేకుండానే ఓ వివాహం ఘనంగా జరిగింది. కానీ దాని వెనుక ఉన్న కథ మాత్రం అందరి చేత కన్నీళ్లు తెప్పిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌కు చెందిన అజయ్ బరోత్(27) మానసిక వికలాంగుడు. చిన్నవయసులోనే తల్లిని కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఆ ఊరిలో ఎవరైనా పెళ్లి జరిగినప్పుడు.. అజయ్ డ్యాన్స్‌లు వేస్తూ బాగా ఎంజాయ్ చేసేవాడు. ఈ నేపథ్యంలో తనకు ఎప్పుడు పెళ్లి చేస్తారంటూ తరచూ ఇంట్లో వారిని అడిగేవాడు. అయితే అజయ్‌కు పిల్లనిచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో అతడి కోరికను తీర్చేందుకు కుటుంబసభ్యులు ఒక అడుగు ముందుకేశారు. పెళ్లి కూతురు లేకుండానే అతడి పెళ్లిని చేశారు. అజయ్‌ను పెళ్లికుమారుడిగా చేసి, ఊరందరిని పిలిచి చాలా అంగరంగ వైభవంగా వివాహాన్నిజరిపించారు.

దీనిపై అజయ్ తండ్రి విష్ణు బరోత్ మాట్లాడుతూ.. ‘‘నా కుమారుడి కోరికను తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమాజం ఏమనుకున్నా నేను బాధపడను’’  అన్నారు. మరోవైపు అతడి కుటుంబసభ్యులు కూడా ఈ వివాహం పట్ల పాజిటివ్‌గా స్పందించారు. తన వివాహాన్ని అజయ్ బాగా ఎంజాయ్ చేశాడని.. అది చూసి తామూ చాలా ఆనందపడ్డామని చెబుతున్నారు.