AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీఎస్టీ ఎగవేతదారులపై కేసులు.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు… దేశ వ్యాప్తంగా 1161 కేసులు నమోదు…

కేంద్రం జీఎస్టీ ఎగవేతదారులపై కొరఢా ఝళిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 1161 కేసులను ది డైరెక్టరేట్ జనర్నల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్, సీజీఎస్టీ కమిషనరేట్ నమోదు చేసింది.

జీఎస్టీ ఎగవేతదారులపై కేసులు.. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు... దేశ వ్యాప్తంగా 1161 కేసులు నమోదు...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 05, 2020 | 12:24 PM

Share

కేంద్రం జీఎస్టీ ఎగవేతదారులపై కొరఢా ఝళిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మూడు వారాల పాటు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా 1161 కేసులను ది డైరెక్టరేట్ జనర్నల్ ఆఫ్ జీఎస్టీ ఇంటలిజెన్స్, సీజీఎస్టీ కమిషనరేట్ నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగువేసేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేశాయి.

దేశ వ్యాప్తంగా ఉన్న 38 నగరాల్లో జీఎస్టీ బృందాలు తనిఖీలను నిర్వహించాయి. వాటిలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, భోపాల్, కల్‌కత్తా, విశాఖపట్నం, సూరత్, వడోదరా, రాజ్ కోట్, ఇండోర్, రాయ్‌పూర్, జమ్మూ వంటి నగరాల్లో జీఎస్టీ బృందాలు పర్యటించాయి. వ్యాపారస్తుల బిల్లులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పలువురు వ్యాపారులు దొంగ జీఎస్టీ నంబర్లతో కొనుగోలు, అమ్మకాలు జరుపుతుండడం, బిల్లు బుక్కుల్లో మోసాలుండడంతో జీఎస్టీ అధికారులు కేసులు నమోదు చేశారు.

ఎమ్మెల్యే కొడుకు…

ముంబైకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు సునిల్ రత్నాకర్ గుట్టె ఫేక్ ఇన్వాయిస్ లతో వ్యాపార కార్యాకలాపాలను నిర్వహించినట్లు జీఎస్టీ బృందాలు గుర్తించాయి. అతడిపై కేసు కూడా నమోదు చేశాయి. అయితే, ఎమ్మెల్యే కొడుకు సునిల్ దాదాపు 520 కోట్ల విలువైన వ్యాపార కార్యకలాపాలను తప్పడు పత్రాల ద్వారా నిర్వహించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, నిందితుడు బెయిల్ కోసం అప్లై చేయగా… ముంబై సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దొంగ ఇన్వాయిస్లు, దొంగ బిల్ పుస్తకాల సాయంతో కోట్ల అవినీతి చేసేందుకు అతడు ప్రయత్నించినట్లు బలమైన ఆధారాలతో జీఎస్టీ సంస్థ కేసును నమోదు చేసింది. కాగా,  పన్ను ఎగవేతదారులపై దాడులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Follow Us
10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో
10 గుంటల్లో సాగు.. 4 నెలల్లో రూ.16లక్షల ఆదాయం.. విదేశీ పంటతో
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
ఏపీలో ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌..
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌