Granite Mining Excavations: ప్రకాశం జిల్లా…. గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు… రూల్స్ ఉల్లంఘించిన రెండు సంస్థలు

ప్రకాశం జిల్లాలో జరిగిన మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుకు తీసుకున్న పెర్ల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ, ఎస్.ఆర్. కంస్ట్రక్షన్స్ అనే మరో సంస్థ కూడా ఇలాగే సంబంధిత నిబంధనలను అతిక్రమించినట్టు మైన్స్ అండ్ జియాలజీ విభాగం అధికారుల

Granite Mining Excavations: ప్రకాశం జిల్లా....  గ్రానైట్  తవ్వకాల్లో అక్రమాలు...  రూల్స్ ఉల్లంఘించిన రెండు సంస్థలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 1:43 PM

Granite Mining Excavations:  ప్రకాశం జిల్లాలో జరిగిన మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుకు తీసుకున్న పెర్ల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ, ఎస్.ఆర్. కంస్ట్రక్షన్స్ అనే మరో సంస్థ కూడా ఇలాగే సంబంధిత నిబంధనలను అతిక్రమించినట్టు మైన్స్ అండ్ జియాలజీ విభాగం అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ జిల్లా చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురం గ్రామ సమీపంలో 7.252 హెక్టార్లలో గ్రానైట్ రాయి తవ్వకానికి సంబంధించి పెర్ల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ పర్మిట్ కు మించి గ్రానైట్ సేకరించినట్టు మైన్స్ అండ్ జియాలజీ విభాగం తన రిపోర్టులో పేర్కొంది.  ఈ సంస్థ లీజు 2011 జనవరి 10 నుంచి అమలులోకి రాగా.. ఇది 2027 జులై 14 వరకు చెల్లుబాటులో ఉంటుంది. అధికారులు గత ఏడాది డిసెంబరు 19 న ఈ సంస్థ జరిపిన గ్రానైట్ తవ్వకాలను పరిశీలించగా.. పలు అక్రమాలు బయటపడినట్టు ఈ నివేదిక పేర్కొంది. టోటల్ రాక్ మాస్ క్వాంటిటీకి, ఏవరేజ్ రీకవరీ శాతానికి, సేలబుల్ గ్రానైట్ క్వాంటిటీకి, అలాగే డిస్పాచ్ పర్మిట్ కి మధ్య ఎంతో వ్యత్యాసమున్నట్టు అధికారులు గుర్తించారు. సేకరించిన గ్రానైట్ కి, చెల్లింపులకు మధ్య కూడా ఎంతో తేడాను కనుగొన్నారు. గ్రానైట్ కన్సర్వేషన్ అండ్ డెవలప్ మెంట్ రూల్స్ (1999) కింద  ఈ సంస్థ ఎలాంటి రికార్డులను మెయిన్ టెయిన్ చేయలేదని, లీజు ఆర్డర్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్, ఏపీపీసీబీ జారీ చేసే సర్టిఫికెట్ ను డిస్ ప్లే చేయలేదని, బౌండరీ పిల్లర్స్ ను కూడా సరిగా మెయిన్ టెయిన్ చేయలేదన్న విషయం బయటపడింది. ఈ నెల 12 న అధికారులు ఈ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ.. 15 రోజుల్లోగా వీటికి సమాధానం ఇవ్వకపోతే.. నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని, లీజును రద్దు చేస్తామని, క్రిమినల్ చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు.

అలాగే ఎస్.ఆర్. కన్స్ట్ర క్షన్స్ అనే మరో సంస్థ కూడా యధేచ్చగా నిబంధలను ఉల్లంఘించినట్టు గుర్తించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొణిదెన గ్రామంలో 14.680 హెక్టార్లలో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించిన క్వారీని ఈ కంపెనీ లీజుకు తీసుకుందని, ఈ కంపెనీ సైతం ఏపీఎంఎంసీ నిబంధనలను ఉల్లంఘించిందని తేలింది. 2005 జూన్ 28 నుంచి ఈ సంస్థ లీజు 20 ఏళ్ళ పాటు అమలులో ఉంటుందని అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. పెర్ల్ అండ్ మినరల్ అండ్ మైన్స్ సంస్థ మాదిరే ఇది కూడా పలు అక్రమాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ సంస్థకు కూడా అధికారులు నోటీసులు పంపుతూ.. 15 రోజుల్లోగా వీటికి సమాధానమివ్వాలని హెచ్చరించారు.