గవర్నర్ నరసింహన్‌కి వీడ్కోలు.. రేపు బాధ్యతలు స్వీకరించనున్న సౌందరరాజన్
ప్రగతి భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు చేరుకున్న నరసింహన్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. వీడ్కోలు కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు నరసింహన్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్.. చెన్నై బయల్దేరనున్నారు. చివరిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్.. నరసింహన్‌కు వీడ్కోలు పలకనున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే వీడ్కోలు సభకు మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ […]

ప్రగతి భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు చేరుకున్న నరసింహన్ దంపతులకు సీఎం కేసీఆర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. వీడ్కోలు కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు నరసింహన్ దంపతులు. బేగంపేట విమానాశ్రయం నుంచి గవర్నర్.. చెన్నై బయల్దేరనున్నారు. చివరిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్.. నరసింహన్‌కు వీడ్కోలు పలకనున్నారు. ప్రగతి భవన్‌లో జరిగే వీడ్కోలు సభకు మంత్రులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్, ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉంది. తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. రేపు సౌందరరాజన్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.