Farmers Protest : తగ్గుతుందా? ఒత్తిడికి తలొగ్గుతుందా? ఈ రోజు ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్..

|

Dec 30, 2020 | 7:46 AM

కేంద్రం వెనక్కి తగ్గుతుందా? రైతు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా? ఇవాళ్టి చర్చల్లో ఏం తేలనుంది. 35 రోజుల రైతుల ఆందోళన నేపథ్యంలో ఇవాళ ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు..

Farmers Protest : తగ్గుతుందా? ఒత్తిడికి తలొగ్గుతుందా? ఈ రోజు ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్..
Follow us on

Farmers Unions : కేంద్రం వెనక్కి తగ్గుతుందా? రైతు సంఘాల ఒత్తిడికి తలొగ్గుతుందా? ఇవాళ్టి చర్చల్లో ఏం తేలనుంది. 35 రోజుల రైతుల ఆందోళన నేపథ్యంలో ఇవాళ ఏం తేలనుందన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 2 గంటలకు రైతు సంఘాలతో సమావేశం కానుంది మంత్రుల బృందం. కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శికి సంయుక్తంగా లేఖ రాసిన లేఖ కిసాన్‌ మోర్చా.. కొత్త సాగు చట్టాల రద్దుపై చర్చించాలని కోరింది.

కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాలి, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించేలా ఎజెండాలో చేర్చాలని పట్టుబడుతున్నాయి రైతు సంఘాలు. ఇవాళ్టి చర్చల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై చర్చించారు.

రైతులతో ఇవాళ ఆరో దఫా చర్చలు జరపబోతుంది కేంద్రం. ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు జరపబోతుంది. మరోవైపు కేంద్రంతో చర్చల నేపథ్యంలో ఇవాళ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీని రేపటికి వాయిదా వేశాయి రైతు సంఘాలు.