AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్…త్వరలో అదిరిపోయే సర్వీస్

బ్యాంకులు తమ కస్టమర్స్‌కి ఇచ్చే సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్దం చేసింది. అంతేకాదు వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇచ్చిన సలహాలపై దేశంలోని వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. […]

బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్...త్వరలో అదిరిపోయే సర్వీస్
Ram Naramaneni
|

Updated on: Jan 12, 2020 | 11:32 AM

Share

బ్యాంకులు తమ కస్టమర్స్‌కి ఇచ్చే సర్వీసుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నాయి. ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా.. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు సిద్దం చేసింది. అంతేకాదు వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఇచ్చిన సలహాలపై దేశంలోని వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది.

క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సేవల వల్ల బ్యాంకులతో పాటు ఖాతాదారులు కూడా చాల ప్రయోజనాలు పొందవచ్చని ఎన్‌సీపీఐ ఆధారాలను చూపుతుంది. నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమేనంటూ పేర్కొంది. ఈ ప్రతిపాదనకు 14 బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి.  ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 30,000 వేల పైచిలుకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్స్‌(ఎటిఎమ్స్)లో ఇంటర్ ఆపరబిలిటీ సర్విసెస్ వెసులుబాటు కల్పించవచ్చని, దీనికి టెక్నికల్ ఇబ్బందులు కూడా పెద్దగా ఉండవంటూ ఎన్‌పీసీఐ వెల్లడించింది. ఇక ఈ సర్వీసెస్‌కు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకిగానీ, ఏటీఎంకి గానీ వెళ్లి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే.. రూ. 10,000లోపు అయితే రూ.25, రూ.10,000 దాటితే రూ.50 ఛార్జస్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంలో నగదు డిపాజిట్ చెయ్యడం వల్ల నకిలీ నోట్లు ప్రభావం ఎక్కువగా సర్కులేట్ అయ్యే అవకాశం ఉంటడంతో చాలా బ్యాంకులు ఈ సర్విసెస్‌పై తర్జనభర్జనలు పడుతున్నాయి. ఇందుకోసం ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే దిశలో కూడా ఆలోచనలు చేస్తున్నాయి.

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ