కాపులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్…

Good News From Jagan Government: కాపులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కాపు, తెలగ, బలిజ కులాలు, ఉపకులాలకు చెందిన మహిళలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. […]

కాపులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్...
Follow us

|

Updated on: Jan 29, 2020 | 11:44 AM

Good News From Jagan Government: కాపులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కాపు, తెలగ, బలిజ కులాలు, ఉపకులాలకు చెందిన మహిళలను ఆదుకునేందుకు వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద మహిళలకు ప్రతీ ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందించనుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికాలవలవన్ మార్గదర్శకాలను జారీ చేశారు.

ఎవరు అర్హులంటే…

  • గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ12. వేలు ఆదాయం కలిగి ఉన్నవారు అర్హులు
  • కుటుంబానికి 3 ఎకరాల్లోపు మాగాణి/ 10 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలి.
  • కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే.. వారు అనర్హులు.
  • 45-60 వయసు ఉన్న వారు అర్హులు..
  • కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు( ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)
  • కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. కానీ పారిశుధ్య ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంది.

ఎంపిక ఎలాగంటే…

ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామ, వార్డు వాలంటీర్లు ఎంపిక చేస్తారు. వారు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. ఈ పథకానికి రూ. 1101.69 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. కాగా, ఈ పథకం అమలు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇక అందులో వివరాలన్నింటినీ పొందుపరచనున్నారు.