AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్‌పై ఆందోళన అక్కర్లేదు.. ఆ వార్తలన్నీ రూమర్సే..

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనా మహమ్మారి కరోనా వైరస్.. మెల్లిగా పొరుగు దేశాలపై కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఇండియాలోనూ కరోనా వైరస్ పాకిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన […]

కరోనా వైరస్‌పై ఆందోళన అక్కర్లేదు.. ఆ వార్తలన్నీ రూమర్సే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 29, 2020 | 7:07 AM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనా మహమ్మారి కరోనా వైరస్.. మెల్లిగా పొరుగు దేశాలపై కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. ఈ క్రమంలో ఇండియాలోనూ కరోనా వైరస్ పాకిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. చైనాలో ఈ వైరస్‌ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 24 మంది మృత్యువాతపడ్డారని తెలిపారు. ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య అధికారికంగా 4,000 దాటిపోయిందన్నారు.

అయితే మన దేశంలో కూడా వ్యాపించిందన్న వార్తలన్నీ రూమర్సేనట. తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా పదుల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదైనట్లు రూమర్స్ రావడంతో.. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా వణికిపోయారు. దీంతో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. నగరంలో కరోనా వైరస్ వ్యాపించిందంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు సంబంధించిన అన్ని విషయాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. దీనిపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర వైద్యుల బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులను సందర్శిస్తోందని.. బుధవారం సమీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో కానీ.. దేశంలో కానీ కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. కాగా, ఫీవర్ ఆసుపత్రిని కేంద్ర నుంచి వచ్చిన 35 మంది వైద్యుల బృందం మంగళవారం సందర్శించింది.

Follow Us
జీమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు.. గూగుల్ స్టన్నింగ్ ఫీచర్
జీమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు.. గూగుల్ స్టన్నింగ్ ఫీచర్
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
వాటి చూస్తేనే ఉలిక్కిపడుతున్న యూనివర్సిటీ విద్యార్థులు!
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
హీరోయిన్‌తో రొమాన్స్ సీన్స్ లేకపోయేసరికి ఆ హీరోకు డౌట్ వచ్చింది..
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
ఐదు భాషల్లో ఫుల్ బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
నీ ముఖానికి బంగారు గొలుసు వేసుకునేంత సీన్‌ ఉందా..!
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
‘మావిగన్’.. రాజధానికి వైఎస్ జగన్ ప్లాన్‌ బీ ప్రతిపాదన..
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకుని పని చేస్తే అంత డేంజరా..?
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. హెల్మెట్ లేకంటే ఆ గ్రామల్లోకి నోఎంట్రీ
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
ఆ స్టార్ డైరెక్టర్ వడ్డీలే నెలకు రూ. 50 లక్షలు కట్టేవాడు..
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం
సిమ్యులేషన్ ఆధారిత వైద్య విద్యకు సరికొత్త గ్లోబల్ ప్రమాణం