Gold Auction: గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
ఈ రోజుల్లో బంగారం రుణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లించని సమయంలో బంగారం వేలం వేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో సకాలంలో రుణం చెల్లించలేని ఖాతాదారుల వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి.
ఈ రోజుల్లో సులభంగా రుణాలు లభించాలంటే అది బంగారంపైనే అని చెప్పక తప్పదు. పెద్ద ప్రాసెస్ లేకుండా బంగారంపై రుణాలు సులభంగా లభిస్తాయి. గత కొన్ని త్రైమాసికాల డేటాను పరిశీలిస్తే, బంగారం రుణాలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వచ్చిన రిపోర్టులో అప్పు తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఒకానొక వరుసలో బంగారం రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగడంతో పాటు.. తిరిగి చెల్లించని వారి సంఖ్య కూడా పెరుగుతోందని డేటా చెబుతోంది. ఈ కారణంగా గోల్డ్ లోన్ కంపెనీలు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తున్నాయి. మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో తాకట్టు పెట్టిన బంగారం వేలం ద్వారా వచ్చిన మొత్తం మూడు రెట్లు పెరిగిందట.
కస్టమ్ డ్యూటీ:
ఈ ఏడాది జూలైలో బడ్జెట్‌లో బంగారంపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గించారు. దీంతో బంగారం ధర పతనమై అప్పు, వడ్డీలకు తాకట్టు పెట్టిన బంగారం విలువ తగ్గిపోయింది. దీంతో గోల్డ్ లోన్ కంపెనీలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే జులై తర్వాత బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే రుణం మొత్తం మించకూడదని కంపెనీలు కోరుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ కఠినంగా వ్యవహరిస్తుండడంతో సకాలంలో రుణం చెల్లించలేని ఖాతాదారుల వద్ద తాకట్టు పెట్టిన బంగారాన్ని కంపెనీలు విక్రయిస్తున్నాయి. ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి కంపెనీలు పెద్ద మొత్తంలో బంగారాన్ని వేలం వేసాయి. ముత్తూట్ ఫైనాన్స్ జులై-సెప్టెంబర్ మధ్య మాత్రమే రూ.250 కోట్ల విలువైన బంగారాన్ని వేలం వేసింది. ఏప్రిల్-జూన్‌లో ఈ సంఖ్య రూ.69 కోట్లుగా ఉంది. మణప్పురం ఫైనాన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ కంపెనీ జూలై-సెప్టెంబర్ మధ్య రూ.360 కోట్ల విలువైన బంగారాన్ని కూడా వేలం వేసింది.
వేలం ఎప్పుడు జరుగుతుంది?
ఒక వ్యక్తి గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించడానికి అతనికి కాలపరిమితి ఇస్తుంది. సకాలంలో చెల్లించని పక్షంలో, కంపెనీని సంప్రదించనట్లయితే, కంపెనీలు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయి. అయితే, వేలానికి ముందు వినియోగదారునికి నోటీసు కూడా అందిస్తుంది.
రెండవ త్రైమాసికంలో వేలం ఆదాయం మూడు రెట్లు పెరగడం, సకాలంలో చెల్లించని వినియోగదారుల పట్ల కంపెనీలు ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్నాయని చూపిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. కంపెనీలు బంగారం వేలం ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Rule Change 2025: కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి