Gold Prices: బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
Gold Rates: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు ధరలు కుప్పకూలగా.. ఇప్పుడు మళ్లీ ఆల్ టైం రికార్డ్ దిశగా దూసుకెళ్తున్నాయి. రోజురోజుకి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బ్యాడ్‌న్యూస్‌గా నిలిచింది. గురువారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ బలపడటం, భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ క్రమంలో గోల్డ్, సిల్వర్ ధరల్లో పెరుగుదల నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా పడిసి ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకటన తర్వాత బంగారం ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. బుధవారం బంగారం ధరలు రూ.7 వేల మేర పెరగ్గా.. వెండి ధరలు రూ.20 వేల మేర పెరిగాయి. ఈ క్రమంలో గురువారం మరోసారి స్వల్పంగా గోల్డ్ ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల అనంనతరం దేశంలోని వివిధ నగరాల్లో బంగారంతో పాటు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ప్రాంతాల వారీగా బంగారం ధరలు..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,59,450గా ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,59,440 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,46,160గా ఉంది. బుధవారం దీని ధర రూ.1,46,150 వద్ద స్థిరపడింది.
-ఇక విజయవాడ, విశాఖపట్నంలో చూస్తే 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,59,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,160గా ఉంది.
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ బంగారం ధర రూ.1,62,570 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇది రూ.1,62,560గా ఉంది. అటు 22 క్యారెట్ ధర రూ.1,49,010గా ఉండగా.. బుధవారం రూ.1,49,000 వద్ద స్ధిరపడింది.
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,450 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.1,59,440గా ఉంది. 22 క్యారెట్ల రేటు రూ.1,46,160గా కొనసాగుతోండగా.. నిన్న రూ.1,46,150 వద్ద స్ధిరపడింది..
-ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,59,600గా కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,46,310గా ఉంది.
వెండి ధరలు ఇలా..
-హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.3,20,100 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.3.20 లక్షలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
-ఇక చెన్నైలో కేజీ సిల్వర్ ధర రూ.3,20,100 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం రూ.3.20 లక్షల వద్ద స్థిరపడింది.
-ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.3,20,100గా ఉండగా.. బెంగళూరులో కూడా ఇదే ధరలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
