బంగారం ధర ఈ రోజు ఇలా.. రేపటి ధర ఎలా ఉంటుందో..!

బంగారం పరుగు కొనసాగుతోంది. అందినట్లే అంది గోల్డ్ రన్ రాజా రన్ అంటోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు..

  • Sanjay Kasula
  • Publish Date - 8:02 pm, Tue, 15 September 20
బంగారం ధర ఈ రోజు ఇలా.. రేపటి ధర ఎలా ఉంటుందో..!

Gold and Silver Prices : బంగారం పరుగు కొనసాగుతోంది. అందినట్లే అంది గోల్డ్ రన్ రాజా రన్ అంటోంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ విధాన భేటీ నేపథ్యంలో పసిడి ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరుగుతోంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం రూ. 51,920 చేరింది.

ఇక కిలో వెండి 855 రూపాయలు ఎగబాకి 69,820 రూపాయలకు చేరింది. డాలర్‌ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎగిశాయి. ఇన్వెస్టర్లు గోల్డ్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్‌ 1962.78 డాలర్లకు చేరింది. ఇక బుధవారం ముగిసే అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ తీసుకునే నిర్ణయాలపై బంగారం ధరల తదుపరి దిశ ఆధారపడి ఉంటుందని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.