AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ ఉదాత్త లక్ష్యంతో తెచ్చిన పథకం అది : కేటీఆర్

ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే ఉదాత్త లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు..

కేసీఆర్ ఉదాత్త లక్ష్యంతో తెచ్చిన పథకం అది : కేటీఆర్
Pardhasaradhi Peri
|

Updated on: Sep 15, 2020 | 8:03 PM

Share

ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు ఇచ్చే ఉదాత్త లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ప్రాజెక్టు తెచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ప్రాజెక్టు అని ఆయన కొనియాడారు. అర్బన్ మిషన్ భగీరథ ప్రాజెక్టు కింద మున్సిపల్ పట్టణాల్లో పనుల పురోగతిని మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. హైదరాబాదు మినహాయించి రాష్ట్రంలో ఉన్న 141 మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ పనులపై కేటీఆర్ సమీక్ష జరిపారు. గ్రామాలతో పోలిస్తే పట్టణాలు, టౌన్లకు కొంచెం వేగంగా విస్తరించే స్వభావం ఉంటుంది కావున.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ టౌన్లలో పనుల పురోగతి ఎలా ఉన్నది, ఎక్కడన్నా ఇతర ప్రభుత్వ విభాగాల సమన్వయం అవసరమా అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ మిషన్ భగీరథ కింద సరఫరా అవుతున్న నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, దీనికొరకు క్రమం తప్పకుండా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, నీటి నాణ్యతను పరీక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Follow Us
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
పసుపు రంగు పుచ్చకాయ తింటే.. వంద రోగాలను ఇట్టే తరిమికొట్టచ్చు
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
తిరుమల దర్శనానికి టీటీడీ కొత్త రూల్.. అమల్లోకి వచ్చేసింది..
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
LPG కొరతలో ఇబ్బంది పడకండి.. వంటకు ఈ ఎలక్ట్రిక్ పరికరాలు బెస్ట్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
బాత్రూమ్ నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూడగా గుండెలు గుభేల్..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
ఏటీఎంలో రూ.10, రూ.20 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు..
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
తీపి బొప్పాయి కావాలా? కొనేటప్పుడు ఈ సూచనలు పాటించండి
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
మరణానికి ముందు నీడ ఎక్కడికి వెళ్తుంది..? ఈ రహస్యాలు తెలిస్తే..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
క్యూట్ చిట్టి కాస్తా హాట్ బ్యూటీగా..
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు
సుర్రుమంటున్న సూరీడు.. ఇలా చేస్తే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు