ప్రధాని మోదీపై అభ్యంతరకర ట్వీట్, సీనియర్ పైలట్ ను తొలగించిన గో ఎయిర్ యాజమాన్యం, సారీ చెప్పినా సీరియస్

ప్రధాని మోదీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన తమ సీనియర్ పైలట్ ను గో ఎయిర్ యాజమాన్యం తొలగించింది. మికి మాలిక్ అనే ఈ పైలట్...

ప్రధాని మోదీపై అభ్యంతరకర ట్వీట్,  సీనియర్ పైలట్ ను తొలగించిన గో ఎయిర్ యాజమాన్యం, సారీ చెప్పినా సీరియస్

Edited By: Anil kumar poka

Updated on: Jan 10, 2021 | 1:34 PM

ప్రధాని మోదీపై అభ్యంతరకరంగా ట్వీట్ చేసిన తమ సీనియర్ పైలట్ ను గో ఎయిర్ యాజమాన్యం తొలగించింది. మికి మాలిక్ అనే ఈ పైలట్ ను తక్షణమే విధులనుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది. తన ట్వీట్ పై మాలిక్ ఆ తరువాత క్షమాపణ చెప్పారు. ఎవరినీ ఉద్దేశించి తను  ఆ ట్వీట్ చేయలేదని, ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని ఆయన అన్నారు. పైగా తన వ్యాఖ్యకు, తన సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ గో ఎయిర్ మేనేజ్ మెంట్ మాత్రం సీరియస్ అయింది. తమది జీరో టాలరెన్స్ పాలసీ అని, సిబ్బంది అంతా తమ రూల్స్ కి అనుగుణంగా నడచుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఏ ఉద్యోగి అయినా ఇలా ట్వీట్ చేశాడంటే అది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అర్థం చేసుకోవాలని కోరింది.

ఇలా ఉండగా లోగడ కూడా గో ఎయిర్ యాజమాన్యం ఓ ట్రెయినీ పైలట్ పై కఠిన చర్యలు తీసుకుంది. రామాయణ సీత, హిందూయిజం పై అభ్యంతరకర ట్వీట్లు చేసిన ఇతనిపై గత జూన్ లో విధుల నుంచి తొలగించింది. అయితే ఇదే పేరు గల మరో వ్యక్తి ఆ ట్వీట్ చేసినట్టు ఆ తరువాత వెల్లడయింది.
Read Also:Viral Video: అరె ! అచ్ఛ జాక్ మా లా ఉన్నాడే ! ఎవరీయన, ఏం చేస్తున్నాడు ? వైరల్ అవుతున్న వీడియో ! అంతా సస్పెన్స్ !
Read Also:Apple Removes Game apps: చైనా స్టోర్ నుంచి భారీ ఎత్తున యాప్‌లు తొలగించిన ఆపిల్‌.. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో..