Apple Removes Game apps: చైనా స్టోర్ నుంచి భారీ ఎత్తున యాప్‌లు తొలగించిన ఆపిల్‌.. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో..

Apple Removes Apps From China Store: లైసెన్స్‌ లేకుండా తమ స్టోర్‌లో ఉన్న చైనా గేమింగ్‌ యాప్‌లను ఆపిల్‌ తొలగించింది. ఒకేరోజు ఏకంగా...

Apple Removes Game apps: చైనా స్టోర్ నుంచి భారీ ఎత్తున యాప్‌లు తొలగించిన ఆపిల్‌.. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 4:53 PM

Apple Removes Apps From China Store: లైసెన్స్‌ లేకుండా తమ స్టోర్‌లో ఉన్న చైనా గేమింగ్‌ యాప్‌లను ఆపిల్‌ తొలగించింది. ఒకేరోజు ఏకంగా 39,000 యాప్‌లను చైనా స్టోర్‌ నుంచి తొలగించినట్లు ఆపిల్‌ అధికారులు తెలిపారు. లైసెన్స్‌లేని గేమింగ్‌ యాప్‌లను నిషేధించాలని చైనా అధికారులు ఆపిల్‌కు విన్నవించడంతో అందుకు అనుగుణంగా టెక్‌ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఆపిల్ స్టోర్‌లో ఉండే యాప్‌లకు ప్రభుత్వ లైసెన్స్‌ నెంబర్‌ కచ్చితంగా ఉండాలి. ఈ క్రమంలోనే చైనాలోని గేమింగ్‌ యాప్‌లకు.. ప్రభుత్వ లైసెన్స్‌ నెంబర్‌ అందజేయాలని ఆపిల్‌ తెలిపింది. ఇందుకుగాను తొలుత 2020 జూన్‌ తుది గడువుగా ప్రకటించింది. అనంతరం ఈ గడువును డిసెంబర్‌ 31కి పెంచింది. అయితే దీనికి సదరు యాప్‌ నిర్వాహకులు స్పందించకపోవడంతో తాజాగా వాటిపై వేటు వేసింది. సుమారు 1500 పెయిడ్‌ గేమ్స్‌లో 74 మాత్రమే ఈ వేటు నుంచి తప్పించుకోవడం గమనార్హం.

Also Read: WhatsApp to Stop Working : అనుకున్నదే జరిగింది.. మిలియన్ల కొద్ది ఫోన్లలో నిలిచిపోయిన వాట్సప్ సేవలు..