మరో రంగంలోకి అడుగు పెట్టనున్న ‘ఆపిల్’.. 2024 నాటికి పరుగులు పెట్టనున్న ఆపిల్ కార్లు. ఈసారైనా పక్కానా.?

ఆపిల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టనుంది. అదే కార్ల వ్యాపారం..

మరో రంగంలోకి అడుగు పెట్టనున్న ‘ఆపిల్’.. 2024 నాటికి పరుగులు పెట్టనున్న ఆపిల్ కార్లు. ఈసారైనా పక్కానా.?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 22, 2020 | 9:35 PM

Apple targets car production: ఆపిల్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫోన్. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టనుంది. అదే కార్ల వ్యాపారం.. త్వరలోనే రోడ్లపై ఆపిల్ కార్లు పరుగులు పెట్టనున్నాయని తెలుస్తోంది. 2024 నాటికి మార్కెట్లోకి కారును తీసుకు రావడానికి ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఆపిల్ నుంచి రానున్న ఈ కార్లలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇక ఈ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో LIDAR  (లేజర్ లైట్‌తో దూరాన్ని కొలిచే) వ్యవస్థ కూడా అందించనుందని, బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించనున్నారని సమాచారం. ఆపిల్ ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఓ అంతర్జాతీయ వార్త సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆపిల్ ‘టైటాన్’ అనే పేరును కూడా నిర్ణయించందని సదరు వార్తా సంస్థ తెలిపింది. ఇదిలే ఉంటే.. నిజానికి తొలిసారి 2014లోనే కార్ల త‌యారీపై ఆపిల్ దృష్టి సారించింది. అంత‌కుముందు యాపిల్‌లో ప‌ని చేసి టెస్లాకు వెళ్లిన సీనియ‌ర్ ఉద్యోగి డాగ్ ఫీల్డ్‌ను 2018లో మ‌ళ్లీ వెన‌క్కి ర‌ప్పించింది ఆపిల్‌. అయితే 2019లో ఈ టీమ్ నుంచి 190 మంది ఉద్యోగుల‌ను తొల‌గించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆపిల్ కార్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఈసారైనా ఆపిల్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో లేదో చూడాలి.

Latest Articles
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!