యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన మొట్టమొదటి వీడియో ఇదే..!
TV9 Telugu
03 May 2024
యూట్యూబ్‌లో దొరకని సమాచారం అంటూ ఏదీ ఉండదంటే అతిశయోక్తి కాదు. తొలిసారిగా అప్‌లోడ్ అయిన వీడియోలో ఏముందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియోను అప్‌లోడ్ చేసింది మరెవరో కాదు.. యూట్యూబ్‌ని స్థాపించిన స్టీవ్ చెన్, చాద్ హర్లే, జావేద్ కరీం.
2005 మేలో యూట్యూబ్ బీటా ప్రజలందరికీ విడుదలైంది. 2006 నవంబర్ నాటికి, రొనాల్డిన్హో నటించిన నైక్ యాడ్ ఒక మిలియన్ వ్యూస్ చేరుకున్న మొదటి యూట్యూబ్ వీడియోగా రికార్డు సృష్టించింది.
ఈ వీడియో షేరింగ్ సైట్ అధికారికంగా డిసెంబర్ 15, 2005న లాంచ్ అయ్యింది. ఆ సమయానికి సైట్‌కి రోజుకు 8 మిలియన్ వ్యూస్ వచ్చేవి.
ఆ సమయంలో వీడియో క్లిప్‌లను 100 మెగాబైట్ సైజ్‌కు మించి అప్‌లోడ్ చేయడం కుదరక పోయేది. అంటే వీడియో ఫుటేజ్ 30 సెకన్లకు మాత్రమే పరిమితమై ఉండేది.
ఇప్పుడు యూట్యూబ్ లో మీరు ఫైల్ 256 జీబీ లేదా 12 గంటలు నిడివి గల వీడియోని అప్‌లోడ్ చేసుకోవడం సాధ్యం అవుతుంది.
యూట్యూబ్ బీభత్సమైన పాపులారిటీని గమనించిన గూగుల్ 2006 అక్టోబర్ నెలలో యూట్యూబ్‌ని 1.65 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.12 వేల కోట్ల)కు కొనుగోలు చేసింది.
ఇప్పుడు కోట్లల్లో సంపద తెచ్చిపెడుతూ గూగుల్ కంపెనీ ఫిలిం ప్రధాన ఆదాయ వనరుగా యూట్యూబ్ అవతరించింది. యూట్యూబ్ గూగుల్ తర్వాత రెండో ప్లేస్ సాధించింది.