యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ సంసంస్థ త్వరలో ఓ కొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ఈ కొత్త కంట్రోల్ ఫీచర్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో కనిపించింది.
భవిష్యత్ అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. విధానాలను ఉల్లంఘించే యూజర్లు వారితో చాట్ చేయకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయడం జరుగుతుంది.
వాట్సాప్ విధానాలను ఉల్లంఘించే వారిపై తాత్కాలికంగా నిషేధం విధిస్తారు.. అప్పుడు యూజర్లు కొత్త వారితో చాట్ చేయలేరు.
ఇప్పటికే ఉన్న చాట్స్ అండ్ గ్రూప్‌లలో మెసేజెస్ పొందడం, వాటికి రిప్లయ్ కూడా చేయవచ్చు. అలాగే అవసరమైన కమ్యూనికేషన్‌లు ఇబ్బంది లేకుండా ఉండేలా చూస్తుంది.
సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించే మోసాలు, బల్క్ మెసేజింగ్ ఇతర అక్టీవిటీస్ సహా వివిధ రకాల దుర్వినియోగాలను గుర్తించడానికి ఆటోమాటిక్ టూల్స్ ఉపయోగిస్తుంది.
ఈ టూల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ కారణంగా మెసేజ్ కంటెంట్ నుండి స్వతంత్రంగా పనిచేస్తాయి. అకౌంట్ కంట్రోల్ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.
పర్మనెంట్ బ్యాన్ కాకుండా టెంపరరీ నిషేధం సెలెక్ట్ ద్వారా వినియోగదారులు వారి డేటాకు పూర్తిగా యాక్సెస్ కోల్పోకుండా వారి అడ్జస్ట్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వాట్సాప్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. యూజర్ల సౌకర్యార్థం వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు పలు కొత్త అప్ డేట్ లను లాంచ్ చేస్తుంది.