వ్యోమగాములకు 'వాల్ ఆఫ్ డెత్' రక్షణ..!

TV9 Telugu

03 May 2024

'వాల్ ఆఫ్ డెత్' వ్యోమగాములను ఫిట్‌గా ఉంచుతుంది.. పరిశోధనల్లో వెల్లడైన షాకింగ్ ఘటన. మనలో చాలా మంది వాల్ ఆఫ్ డెత్ చూసే ఉంటారు.

కానీ వ్యోమగాములకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా..? చంద్రునిపైకి చేరిన తర్వాత అక్కడి పరిస్థితి భూమికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

అయితే అక్కడికి వెళ్లిన వ్యోమగాములందరూ అక్కడ ఎలా ఫిట్‌గా ఉంటారనేదీ చాలా మందికి ఉత్పన్నమయ్యే అతిపెద్ద ప్రశ్న.

దీనిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. మృత్యుబావిలో విన్యాసాలు చేసేవారి ఎముకలు, కండరాలు చాలా బలంగా ఉంటాయని చెప్పారు.

వ్యోమగాములు చంద్రునికి సమీపంలో ఉన్న గుండ్రని రాళ్లపై ప్రతిరోజూ గంటకు 8 మైళ్ల కంటే ఎక్కువ వేగంతో పరుగెత్తాలని సూచించారు.

భూమిపై ఉన్న 'వాల్ ఆఫ్ డెత్'లో విన్యాసాలు చేయడం చాలా కష్టమని, అయితే తక్కువ గురుత్వాకర్షణ వల్ల చంద్రునిపై ఇది సులభంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

అనేక అంతరిక్ష సంబంధిత మిషన్లు ప్రారంభిస్తారు. అయితే వ్యోమగాములు చివరిసారిగా 1972లో చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టారు.

2026 ప్రారంభంలో, నాసా ఆర్టెమిస్ వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై మిషన్‌తో చంద్రుని చుట్టూ ప్రయాణించబోతున్నారు.