తెలంగాణ ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో డీల్…

తెలంగాణ ఆర్టీసీ కార్గోతో గొప్ప డీల్ కుదిరింది. టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం చేసుకుంది.

తెలంగాణ ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో డీల్...
Follow us

|

Updated on: Nov 07, 2020 | 4:19 PM

తెలంగాణ ఆర్టీసీ కార్గోతో గొప్ప డీల్ కుదిరింది. టీఎస్ఆర్‌టీసీతో జీఎంఆర్ ఎయిర్ కార్గో ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ ఎయిర్ కార్గో & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ డివిజన్‌కు చెందిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో శనివారం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పువ్వాడ‌ అజయ్ కుమార్ సమక్షంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈవో సౌరభ్ కుమార్, టీఆర్ & బీ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫస్ట్ మైల్ అదేవిధంగా లాస్ట్ మైల్ కార్గో బస్ ఫీడర్ సర్వీస్ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ ఎగుమతుల‌ను, దిగుమ‌తుల‌ను సంయుక్తంగా ప్రోత్స‌హించ‌నున్నారు. ఈ చ‌ర్య జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌ను తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరుకుల రవాణాకు ఉపయుక్తంగా ఉండనుంది.

జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో భారతదేశపు ప్రముఖ ఆధునిక ఎయిర్ కార్గో టెర్మినల్‌లో ఒకటి. దేశవ్యాప్తంగా వివిధ రకాల సరుకులను చేర‌వేడంలో స‌క‌ల స‌దుపాయాల‌ను క‌లిగిఉంది. ఫార్మా, వ్యాక్సిన్లు, పెరిషబుల్స్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి సరుకులను జీహెచ్ఏసీ రవాణా చేస్తోంది. అంతర్జాతీయ కనెక్టివిటీలతో జీహెచ్ఏసీ దేశంలోని దక్షిణ-మధ్య ప్రాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో సరుకుల చేరవేతలో ఒక గేట్‌వే అని సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌కు టీఎస్‌ఆర్‌టీసీ మొదటి మైల్‌ పిక్-అప్, డెలివరీ సేవలను ప్రారంభించినట్లు మంత్రి పువ్వాడ ఆజయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని ప్రాంతాలకు హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే అంతర్జాతీయ దిగుమతి రవాణాకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించనుది. ఒప్పందం ప్ర‌కారం.. కీ ఫీడర్, డెలివరీ మార్గాలను కవర్ చేసే కార్గో బస్ సేవల‌ను జీఎంఆర్ కార్గో ప్రారంభిస్తుంది. జీఎంఆర్ కార్గో బుకింగ్, డెలివరీ సంబంధిత సేవల కోసం కార్గో ట్రేడ్ కోసం ఎంపిక‌చేసిన కార్గో టెర్మినల్స్ వద్ద టీఎస్ఆర్‌టీసీ కౌంటర్లను కూడా తెరవ‌నుంది.

చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
చెరుకు రసంతో కల్తీ లేని కమ్మటి బెల్లం.!ఇంట్లోనే తయారు చేసుకోండిలా
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి