గుడ్‌న్యూస్.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ షురూ.. భారత్ మరో ముందడుగు..

గుడ్‌న్యూస్.. మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ షురూ.. భారత్ మరో ముందడుగు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిద్-19 చికిత్సలో సత్ఫలితాస్తుందని భావిస్తున్న

TV9 Telugu Digital Desk

| Edited By:

May 12, 2020 | 5:43 PM

Antiviral drug Favipiravir: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిద్-19 చికిత్సలో సత్ఫలితాస్తుందని భావిస్తున్న యాంటీ-వైరల్‌ ఔషధం ‘ఫవిపిరవిర్‌’ (Favipiravir) క్లినికల్‌ ట్రయల్స్‌ భారత్‌లో కీలక దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా దీన్ని కొవిడ్‌-19 రోగులపై పరీక్షించనున్నట్లు ‘గ్లెన్‌మార్క్‌ ఫార్మాస్యూటికల్స్‌’ వెల్లడించింది.

వివరాల్లోకెళితే.. ఈ డ్రగ్‌ను పరీక్షించేందుకు గత నెల ‘డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా'(డీసీజీఐ) సంస్థకు అనుమతులిచ్చింది. ‘ఫవిపిరవిర్‌’ కొవిడ్‌-19ను నయం చేసే సామర్థ్యంపై జరుపుతున్న పరీక్షల్లో భారత్‌లో మూడో దశకు చేరిన తొలి సంస్థ తమదేనని గ్లెన్‌మార్క్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం పది సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయని గ్లెన్‌మార్క్‌ వెల్లడించింది.

కాగా.. జులై లేదా ఆగస్టు నాటికి ఈ పరీక్షలు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రోగుల చికిత్సకు 14 రోజులు, అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుందని తెలిపింది. ఈ డ్రగ్‌ తయారీకి కావాల్సిన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌(ఏపీఐ), సంబంధిత సూత్రీకరణలను సైతం రూపొందించినట్లు పేర్కొంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కొవిడ్‌-19 చికిత్సలో ముందడుగు పడినట్లేనని సంస్థ ఉపాధ్యక్షురాలు మోనికా టాండన్‌ తెలిపారు.

అయితే.. జపాన్‌లో ఇన్‌ఫ్లుయంజా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఫవిపిరవిర్‌ను కనుగొన్నారు. కొవిడ్‌-19 వెలుగుచూశాక చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో బాధితులకు ఈ ఔషధాన్ని ఇచ్చి ఫలితాలను విశ్లేషించారు. దీనివల్ల బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. జపాన్‌కు చెందిన టొయామా కెమికల్‌ అనే కంపెనీకి చెందిన ‘అవిగన్‌’ అనే బ్రాండుకు ఫవిపిరవిర్‌ జనరిక్‌ ఔషధం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu